ఇండియాకి సగం దరిద్రం వదిలిపోయింది!

SriRamaNavami

భారతదేశంలో పేదరికం క్రమంగా తగ్గిపోతోందంటూ ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. దేశంలో 27 కోట్ల మంది పేదరికాన్ని జయించారని ఐక్యరాజ్య సమితి గణాంకాలతో సహా ప్రకటించింది. సాధారణంగా ఎన్నికల వేడి ఉన్నప్పుడు దేశం అభివృద్ధి చెందిపోతోందని ఏవో గణాంకాలు చూపుతూ ప్రభుత్వాలు ప్రకటనలు చేయడం మామూలే… అలాగే ఎన్నికల ముందు పాజిటివ్ సర్వే రిజల్ట్స్ కూడా వస్తుంటాయి. మామూలుగా అయితే ఈ టైమ్‌ లో దేశం అభివృద్ధి గురించి న్యూస్‌ ప్రకటన ఏదైనా వస్తే – దాని వెనుక ఏ మోడీ గారి హస్తమో లేదు కదా… అని ఎవరైనా అనుకునే అవకాశం లేకపోలేదు. అయితే – ఇవి ఐరాస గణాంకాలు కాబట్టి – అంతర్జాతీయ స్థాయిలో చేసే సర్వేల ఆధారంగా ఉంటాయి కాబట్టి – అలా అనుకోలేం. పైగా ఐరాస ప్రకటించిన గణాంకాలు – కేవలం గత నాలుగు లేదా ఐదేళ్లకి సంబంధించినవి కావు. 2005 నుంచి 2016 మధ్యలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలకి సంబంధించిన వివరాలవి.
ప్రపంచవ్యాప్తంగా చేపట్టిన దారిద్ర్య నిర్మూలన కార్యక్రమాలు విజయవంతం కావడం వల్ల – ఇప్పుడు మెరుగైన దేశాల్లో భారతదేశం కూడా చేరిందట. జీవనప్రమాణాల విషయంలో భారత్ అభివృద్ధి పథంలో వెళుతోందట. సంపదకి సంబంధించిన ప్రమాణాల ప్రకారం లెక్కించి చూస్తే – ఆ పదేళ్ళ కాలంలో భారత్‌లో పేదరికం 50 శాతం వరకూ తగ్గిందట. అంటే సగానికి సగం పేదరికం తగ్గిపోయిందన్నమాట! ఈ విషయాల్నేఐక్యరాజ్య సమితి చెప్పింది. నిజంగా ఇది ఎంతో శుభవార్త! కాబట్టి దీని వెనుక రాజకీయ కారణాల్నీ ఊహించకుండా మనస్ఫూర్తిగా సంతోషిద్దాం. జై భారత్.

This post is also available in: enఇంగ్లిష్‌


PremaLekhalu