ఆలీనా? స్టాలినా? టాలీవుడ్‌ నటుల గ్రీన్‌ ఛాలెంజ్‌!


మీరు ఒక చెట్టు నాటండి. మరో ముగ్గురికి చెట్టు నాటమని చెప్పండి – అని ఆలీ అంటున్నట్టు కనిపిస్తోంది. ఆలీ చెప్పినట్టే చెట్లు నాటినట్టు కనిపిస్తున్నారు – ఆ వెనక్కాలున్న కృష్ణభగవాన్‌, కాదంబరి, రఘుబాబు. ఇంతకీ ఈయన ఆలీనా? స్టాలినా? అనుకోకండి. ఆలీనే!

దయచేసి మనిషికి మూడు చెట్లు నాటండి .. అంటూ గ్రీన్ ఛాలెంజ్ లో పాల్గొన్న ప్రఖ్యాత హాస్యనటులు అలీ, కృష్ణ భగవాన్, రఘు బాబు కలసి పిలుపునిచ్చారు. బంజారాహిల్స్ రోడ్ నె 12 లో ఉన్న పార్క్‌లో వీళ్లు ముగ్గురూ మూడేసి మొక్కలు నాటారు.

తెలంగాణ ప్రభుత్వ హరితహారం కార్యక్రమానికి ఆదర్శంగా కార్యక్రమం హరా హైతో భరా అట! గ్రీన్‌ ఛాలెంజ్‌ అంటే దేశం అంతా అర్థమవుతుంది కదా? ఇక్కడ మళ్లీ దిక్కుమాలిన హిందీ గోల ఎందుకు? సర్లే. ఏదైతేనేం ఈ ఆకుపచ్చ పిలుపుతో అన్ని వర్గాల్నీ ఆకట్టుకుంటున్న గ్రీన్ ఛాలెంజ్‌ వీళ్లలో కూడా స్ఫూర్తి నింపిందట.

కాదంబరి కిరణ్ ఆధ్వర్యంలో బంజారా హిల్స్‌లో ఎమ్మెల్యే కాలనీలో జీహెచ్ఎమ్సీ పార్క్ లో వీళ్లంతా పాల్గొన్నారు. అసలే మనోడు మేము సైతం అంటాడు కాబట్టి – ఇలాంటివన్నీ హుషారుగానే చేపడతాడు. ఈ గ్రీన్ ఛాలెంజ్ లో ప్రతి వ్యకి 3మొక్కలు చొప్పున నాటి తిరిగి – మరో ముగ్గురికి గ్రీన్ ఛాలెంజ్ స్వీకరించాలని పిలుపునిచ్చారు.

ఇఫ్పటికి నాటిన మొక్కల సంఖ్య కోటి దాటిందట. ఎన్ని మొక్కలు నాటాం కాదన్నయ్యా? ఎన్నిటికి నీళ్లు పోస్తున్నాం? ఫైనల్‌గా ఎన్ని బతుకుతున్నాయ్‌? అన్నది ముఖ్యం. మరి అది కూడా చూసుకోండి. ఏదైనా మంచి కార్యక్రమం చేశారు. సినిమావాళ్లు చేస్తే దేనికైనా కలర్‌ వస్తుందంటారు కాబట్టి – కొంతమందైనా ఇది చూసి ఇన్‌స్పయిర్‌ అయితే మంచిదే మరి!

47 / 100 SEO Score

This post is also available in: ఇంగ్లిష్‌


ADVERTISE HERE