ఆర్తీ అగర్వాల్‌ని అందరూ మరిచిపోయినా…


మహాద్భుతమైన క్లాసిక్స్‌ ఏవీ చేయకపోయినా, ఓ మెరుపు మెరిసి ఆరిపోయిన తారగా ఆర్తి అగర్వాల్ చాలామందికి గుర్తుంటుంది. అందుకేనేమో, ఈ ఆర్టికల్‌కి వాళ్లు ‘ మణ్ణిల్‌ ఉదిర్‌న్ద మిన్నిల్‌ నట్చత్తిరమ్‌’ ( మట్టి పాలైన మెరిసే నక్షత్రం ) అని టైటిల్‌ పెట్టారు.

ఒకప్పుడు టాప్‌ స్టార్‌ గా వెలిగింది ఆర్తీ అగర్వాల్‌. ‘నువ్వు నాకు నచ్చావ్‌’ సినిమాతో వచ్చి, తరవాత ఎందరో స్టార్‌ హీరోలతో నటించి, స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుని – టాప్‌లో చాలాకాలం ఉంది. అయితే కెరీర్‌ లో వెనకబడ్డాక కూడా – సునీల్‌ హీరోగా నటించిన ‘అందాల రాముడు’ తో కూడా హిట్‌ హీరోయిన్‌ అనిపించుకుంది. తరవాత కాస్మటిక్ సర్జరీ ఫెయిలై – ఆమె కన్ను మూసిన వైనం అందరికీ తెలిసిందే!

ఎక్కడ సక్సెస్‌ ఉంటే – ఎక్కడ లాభం ఉంటే అక్కడికి పరిగెత్తే సినిమా పరిశ్రమలో – కథల్లో సెంటిమెంట్స్‌ వాడుకుంటారు గానీ, బయట పెద్దగా సెంటిమెంట్లు ఉండవని అంటారు. ఒకప్పుడు తాము అభిమానించిన వ్యక్తుల్ని జనం తలుచుకోవాలిగానీ, సినిమా రంగం తలచుకోవడం అరుదు. ఇప్పుడు ఆర్తిని దాదాపు అందరూ మరిచిపోయారని చెప్పవచ్చు.

అయితే ఆర్తిని ఇటీవల ఓ తమిళ పత్రిక తలచుకుంది. వణ్ణత్తిరై ( రంగుల తెర ) అనే ఈ తమిళవార పత్రిక ఆరు పేజీల ఆర్టికల్‌ రాసింది. టాప్‌ స్టార్‌గా ఉన్న సమయంలో తమిళంలో కూడా కాలుమోపి హిట్ చిత్రాల్లో నటించింది ఆర్తి. ఏదేమైనా మహాద్భుతమైన క్లాసిక్స్‌ ఏవీ చేయకపోయినా, ఓ మెరుపు మెరిసి ఆరిపోయిన తారగా ఆర్తి అగర్వాల్ చాలామందికి గుర్తుంటుంది. అందుకేనేమో, ఈ ఆర్టికల్‌కి వాళ్లు ‘ మణ్ణిల్‌ ఉదిర్‌న్ద మిన్నిల్‌ నట్చత్తిరమ్‌’ ( మట్టి పాలైన మెరిసే నక్షత్రం ) అని టైటిల్‌ పెట్టారు.

This post is also available in: enఇంగ్లిష్‌


PremaLekhalu