ఆకాంక్ష సింగ్‌ చేతుల మీదుగా హెచ్‌డీఎఫ్‌సీ గణేశ అవార్డులు!


గణేశ ఉత్సవాలు పూర్తయ్యాయి. ఇప్పుడు అవార్డుల సీజన్‌ నడుస్తున్నట్టుంది.

వివిధ గేటెడ్‌ కమ్యూనిటీలలో ఏర్పాటు చేసిన అత్యంత జనాదరణ పొందిన వినాయకులకి పురస్కారాలు ఇస్తామంటూ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ వాళ్లు పోటీ నిర్వహించారు. జనం చేత ఓట్లు కూడా వేయించారు. మొత్తానికి కొంపల్లి శాటిలైట్ టౌన్షిప్ లో ఉన్న వినాయకుడు 1,24,903 ఓట్లతో ఫస్ట్‌ ప్రైజ్‌ గెలుచుకున్నాడు. కొత్త హీరోయిన్‌ ఆకాంక్ష సింగ్‌ చేత అవార్డ్‌ ఇప్పించారు.

కానీ బాధాకరమైన విషయం ఏంటంటే – ఈ విషయం గురించి రిలీజ్‌ చేసిన ప్రెస్‌ మీట్‌ లో  అసలు ఏ వినాయకుడికి ప్రైజ్‌ ఇచ్చారో ఆ ఫొటోగానీ, ఎందుకిచ్చారో ఆ వివరంగానీ లేదు. నిజమే మరి! అంటే అన్నావంటారు గానీ… ఇవి ఏమయినా భక్తితో చేసే ప్రోగ్రాములా? బిజినెస్‌ ప్రమోషన్‌ కోసం చేసేవి ఇలాగే ఉంటాయి. నాని, నాగార్జున కొత్త సినిమా( దేవదాస్‌ ) లో కొత్త హీరోయిన్‌ కాబట్టి ఆకాంక్షని పట్టుకొచ్చారు. బ్యాంక్‌ బ్రాండ్‌ నేమ్‌ ఎస్టాబ్లిష్‌ అవ్వాలన్న ఆకాంక్ష కూడా తీరింది. ఇంక ఆఫ్ట్రాల్‌ వినాయకుడి విగ్రహం ఏదయితే ఏంటి? బహుశా అందుకే ఏ వినాయకుడికి ఇచ్చారో ఆయన ఫొటో కూడా లేదు.

ఇంతకీ ఏయే గేటెడ్‌ కమ్యూనిటీలు అవార్డులు గెలిచాయో తెలుసా?

శాటిలైట్‌ టౌన్‌షిప్‌, కొంపల్లి, 124903 ఓట్లు 1st ప్రైజ్‌ రూ. 50000;

జనప్రియ అపార్ట్‌ మెంట్స్‌, మోహన్‌ నగర్‌, 46350 ఓట్లు 2nd ప్రైజ్‌ Rs.25000;

కాంక్రీట్‌ పాలజో, నాచారం, 39504 ఓట్లు 3rd ప్రైజ్‌ Rs.10000;

జనప్రియ ఆర్కేడ్‌, కౌకూర్‌, 33597 ఓట్లు 4th ప్రైజ్‌ Rs.5000

భవ్యాస్‌ తులసీవనం, కేపీహెచ్‌బీ, 27531 vఓట్లు 5th ప్రైజ్‌ of Rs 5000.

మొత్తానికి – హీరోయిన్‌ ఫొటోలూ బ్యాంక్‌ ఆఫీసర్ల ఫొటోలూ తప్ప ఏ వినాయకుడి ఫొటో కూడా ప్రెస్‌ రిలీజ్‌ లో లేకపోవడం విశేషం. ఏ ఫేస్‌బుక్‌లోనో వెతుక్కోవాల్సిందే !  జై గణేశ్‌ మహారాజ్‌ కీ జై!

This post is also available in: enఇంగ్లిష్‌


PremaLekhalu