ఆకట్టుకుంటున్న ‘మనసుకు నచ్చింది’ టీజర్

SriRamaNavami

హీరో మహేష్ బాబు అక్క మంజుల ఘట్టమనేని డైరెక్టర్ గా తీస్తున్న మొదటి చిత్రం ‘మనసుకు నచ్చింది’. ఈ సినిమాకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్ రిలీజ్ అయి ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభిస్తోంది. టీజర్ ని చూస్తుంటే ఈ సినిమా మంచి ట్రైయాంగిల్ లవ్ స్టోరీ లా ఉంది.
ఈ సినిమాలో సందీప్ కిషన్, అమైరా దస్తూర్, త్రిధా చౌదరి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాని సంజయ్ స్వరూప్, జెమినీ కిరణ్ ఇందిరా ప్రొడక్షన్స్ , ఆనంది ఆర్ట్స్ బ్యానర్ మీద సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాని రిపబ్లిక్ డే కానుకగా జనవరి 26న రిలీజ్ చేయనున్నారు.

This post is also available in: enఇంగ్లిష్‌


PremaLekhalu