అలెక్సా! కాస్త తెలుగు న్యూస్‍ వినిపించు!


అలెక్సా! ఏంటి విశేషాలు? అని అడిగితే చాలు… వార్తల నుంచి వాతావరణం వరకు తడుముకోకుండా చెప్పేసే గాడ్జెట్‍ అమెజాన్‍ అలెక్సా! ఇప్పుడు దీంట్లో ’డిటైల్డ్ న్యూస్‍ రీడింగ్‍ ’ అనే కొత్త ఆప్షన్‍ ను పెట్టింది అమెజాన్‍. మరి ఏంటి ఈ డిటైల్డ్ న్యూస్‍ అంటే? ఇప్పటివరకూ వాయిస్‍ కమాండ్స్ తో “అలెక్సా, ప్లే న్యూస్‍” అంటే వార్తలు వచ్చేవి. కానీ ఇప్పుడు ఫలానా న్యూస్‍ సోర్స్ నుంచే వార్తలు కావాలని అడగొచ్చు. ఉదాహరణకి “అలెక్సా, ప్లే న్యూస్ ఫ్రమ్‍ సీఎన్‌ఎన్‍” అంటే CNN న్యూస్‍ ప్లే అవుతుంది. అలాగే CNBC, Bloomberg, , Fox News ఇలా ఏ సోర్స్ నుంచి వార్తలు వినాలనుకుంటున్నారో ఎంపిక చేసుకోవచ్చు. భారతదేశంలో లభిస్తున్న అలెక్సా డివైజ్‍ల్లో కూడా త్వరలోనే వివిధ ఇండియన్‍ న్యూస్‍ రిసోర్సుల నుంచి వార్తలు అందించే విధంగా – ఈ డిటైల్డ్ న్యూస్‍ ఆప్షన్‍ ఉంటుందని ఆశించవచ్చు.

This post is also available in: enఇంగ్లిష్‌


PremaLekhalu