అర్జున్ సురవరం ఫస్ట్ డే 4.1 కోట్లట! అయితే?


నిఖిల్, లావ‌ణ్య త్రిపాఠి జంట‌గా నటించిన చిత్రం `అర్జున్ సుర‌వ‌రం`. బి.మ‌ధు స‌మ‌ర్ప‌ణ‌లో మూవీ డైన‌మిక్స్ ఎల్ ఎల్ పి బ్యాన‌ర్‌పై టి.సంతోష్ ద‌ర్శ‌క‌త్వంలో రాజ్‌కుమార్ ఆకెళ్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. న‌వంబ‌ర్ 29న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా హీరో నిఖిల్ మాట్లాడుతూ..
అర్జున్ సురవరం సినిమా థియేటర్స్ లో సందడి చేస్తోంది. మొదటి ఆటనుండి పాజిటీవ్ రెస్పాన్స్ వస్తోంది. ఫస్ట్ డే ప్రపంచవ్యాప్తంగా 4.1 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. మా చిత్ర యూనిట్ అందరూ ఈ సక్సెస్ తో హ్యాపీగా ఉన్నాము. నిర్మాత ఠాగూర్ మధు గారు, రాజ్ కుమార్ గారు రిచ్ ప్రొడక్షన్ వ్యాల్యూస్, సంతోష్ టేకింగ్ ఇలా అందరి ఎఫర్ట్ తో సినిమా అన్ని ఏరియాల్లో బాగా కలెక్ట్ చేస్తోంది. కొంత గ్యాప్ తరువాత ప్రేక్షకుల ముందుకు వచ్చినా సరే ఆడియన్స్ బాగా రిసీవ్ చేసుకున్నారు. సినిమాలో ఉన్న మెసేజ్ కు ఆడియన్స్ కనెక్ట్ అయ్యారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు మెయిన్ హైలెట్ అయ్యింది. లావణ్య ఈ సినిమాలో మరో మంచి రోల్ చేసింది. ఈ క్యారెక్టర్ ను నమ్మి ఈ సినిమా ఒప్పుకున్నందుకు ఆమెకు థాంక్స్, సినిమా చూడనివారు చూడండి, మిమ్మల్ని అర్జున్ సురవరం తప్పకుండా ఎంటర్టైన్ చేస్తాడన్నారు.

చిత్ర నిర్మాత రాజ్‌కుమార్‌ అకెళ్ల మాట్లాడుతూ…
చాలా సమస్యలను అధిగమించి ఈ సినిమాను రిలీజ్ చేశాము. సినిమా బాగుందని అందరూ అంటున్నారు. సినిమాను ఇంత పెద్ద సక్సెస్ చేసిన ఆడియన్స్ కు ధన్యవాదాలు. ఈ సక్సెస్ నాకు మరిన్ని సినిమాలు చెయ్యడానికి బూస్టప్ ఇచ్చిందని అన్నారు.

చిత్ర దర్శకుడు టి.సంతోష్‌ మాట్లాడుతూ..
తెలుగులో నా తొలి చిత్రమిది. మమ్మల్ని సపోర్ట్‌ చేస్తున్న ఆడియన్స్ కు థ్యాంక్స్‌. చాలా మంది నన్ను అడిగారు అర్జున్ సురవరం అంటే ఏంటి? అని అర్జున్ అంటే క్లీన్. ఈ సినిమాలో అర్జున్ క్యారెక్టర్ క్లీన్, ప్యూర్ రిపోర్టర్. సురవరం అనేది సీనియర్ జర్నలిస్ట్ సురవరం ప్రతాప రెడ్డి గారి ఇన్స్పిరేషన్ తో తీసుకోవడం జరిగింది. అలాగే మా నిర్మాతలు మధు, రాజ్ కుమార్ గారికి ధన్యవాదాలు, షూటింగ్ సమయంలో వారి హెల్ప్ సపోర్ట్ మరువలేనిది. నిఖిల్, లావణ్య సినిమాకు మెయిన్ హైలెట్. నిఖిల్ తో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ మర్చిపోలేనిదన్నారు.

హీరోయిన్ లావణ్యా త్రిపాఠి మాట్లాడుతూ..
సినిమా బాగుందని అందరూ అంటుంటే హ్యాపీగా ఉంది. ఈ ఏడాది విడుదలవుతున్న నా మొదటి తెలుగు సినిమా ఇంత సక్సెస్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. నేను మూవీలో పార్ట్ అయినందుకు ముందుగా నిర్మాతలకు ధన్యవాదాలు తెలుపుతున్నాను అన్నారు. సినిమా సక్సెస్ అయిన సందర్బంగా చిత్ర యూనిట్ సభ్యులందరికి అభినందనలు తెలిపారు.

న‌టీన‌టులు:
నిఖిల్‌, లావ‌ణ్య త్రిపాఠి, వెన్నెల‌కిషోర్‌, పోసాని కృష్ణ‌ముర‌ళి, త‌రుణ్ అరోరా, నాగినీడు, స‌త్య‌, విద్యుల్లేఖా రామ‌న్ త‌దిత‌రులు
సాంకేతిక వ‌ర్గం:
ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: టి.సంతోష్‌
స‌మ‌ర్ప‌ణ‌: ఠాగూర్ మ‌ధు
నిర్మాత‌: రాజ్‌కుమార్ అకెళ్ల‌,
సంగీతం: సామ్ సి.ఎస్‌,
సినిమాటోగ్ర‌ఫీ: సూర్య‌,
ఎడిట‌ర్: న‌వీన్ నూలి.

65 / 100 SEO Score

This post is also available in: ఇంగ్లిష్‌


ADVERTISE HERE