అర్జున్‌ కి క్లీన్‌ సర్టిఫికెట్‌ ఇచ్చిన సోనీ ఛరిష్టా


అర్జున్ సర్జా అసలు సిసలు జెంటిల్ మాన్ – అంటోంది సోనీ చరిష్టా.
మా పల్లెలో గోపాలుడు, మన్యంలో మొనగాడు, టెర్రర్, జెంటిల్ మెన్, ఒకే ఒక్కడు, నా పేరు సూర్య-నా ఇల్లు ఇండియా’ వంటి చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానం ఏర్పరచుకుని..  ‘ఏక్షన్ కింగ్’గా పిలువబడే అర్జున్ సర్జా.. తనతో నటించే హీరోయిన్ తో అసభ్యంగా ప్రవర్తించాడనే ఆరోపణని తాను ఎంతమాత్రం నమ్మలేకపోతున్నానని యువ కథానాయకి సోనీ చరిష్టా అన్నారు. ఈమేరకు ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు. ‘కాంట్రాక్ట్’ అనే చిత్రంలో ఆయనతో తాను కలిసి నటించానని, ఆయన అసలు సిసలు జెంటిల్మెన్ అని ఆమె పేర్కొన్నారు. ‘మీ టూ’ మెల్లగా పక్క దోవ పడుతోందని తాను  వ్యక్తిగతంగా అభిప్రాయపడుతున్నానని సోని తెలిపారు. అర్జున్ సర్జా, సోనీ చరిష్టా నటించిన ‘కాంట్రాక్ట్’ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది!! 

This post is also available in: enఇంగ్లిష్‌


PremaLekhalu