అబ్బే. ఈ స్టిల్‌ ఏం బాలే!

SriRamaNavami

ఎన్టీఆర్‌ బయోపిక్‌ కి హైప్‌ తీసుకురావడానికి పాపం క్రిష్‌ రోజూ ఏదో ట్రై చేస్తున్నాడు గానీ.. ఈరోజు ఫెయిలయ్యాడు. బాలకృష్ణ ఎన్టీఆర్‌గా, సుమంత్‌ ఏఎన్నార్‌గా సిగరెట్లు కాల్చుకుంటున్న స్టిల్‌ రిలీజయింది. అయితే చొక్కాలు చూస్తే తప్ప – వాళ్లు ఎన్టీఆర్ అనీ ఏఎన్నార్‌ అనీ అనుకోవడం కష్టమే. పెద్దగా పోలికలు కనిపించడం లేదు. అప్పట్లో ఎన్టీఆర్‌ రౌండ్‌ కాలర్స్‌ ఉన్న షర్టులు వేసేవాడు. ఇక పోతే దీంట్లో నాగేశ్వరరావు స్టయిల్లో పెదవులు మధ్య సిగరెట్‌ పెట్టడంలో సుమంత్‌ సక్సెస్‌ అయ్యాడు. ఈ రెండు పాయింట్లూ తప్ప ఈ చిత్రంలో మెచ్చుకోదగింది ఏమీ కనిపించడం లేదు. ముఖ్యంగా విగ్గుల్లేకుండా ఉండే ఇద్దరి హెయిర్‌ స్టయిల్స్‌ విషయంలోనూ ఎక్కడో ఫెయిలయినట్టుగా కనిపిస్తోంది.

This post is also available in: enఇంగ్లిష్‌


PremaLekhalu