అన్న వదిలేసిండు.. RX100 కార్తికేయ పిలవగానే వచ్చిండు!


మనోడు ఈడ్చి తంతే చేసిన సినిమాలు నాలుగు లేవు. అప్పుడే సాంగ్‌ ఓపెనింగులూ ఫంక్షన్లకి వెళ్లి లాంచింగులూ.. ఎందుకయ్యా కార్తికేయా నీకీ బాధ! అవున్లే పాపం నువ్వు మాత్రం ఏం చేస్తావ్‌? మొహమాటం .. ఇంకా పెద్దగా ఎదక్కపోయినా పిలిస్తే రాలేదు పొగరనుకుంటారని వెళ్లి ఉంటావ్‌.. అయినా మీరేంటయ్యా… ఒకణ్ణి పట్టుకుని మనం నీళ్లలోంచి బయటపడాలనుకున్నప్పుడు… ఆ పట్టుకునేది ఒడ్డు మీద గ్రిప్‌ దొరికినవాడిని పట్టుకోవాలి. అప్పుడే మిమ్మల్ని కూడా పైకి లాగగలుగుతాడు ఎంతో కొంత. అంతేగానీ… అతనే ఇంకా స్థిరపడలేదు. అప్పుడే ఏంటి మీరు ఆయన ఇమేజ్‌ని ఉపయోగించుకునేది? అవున్లే.. అందుబాటులో ఉన్నాడు మరి.. రేపు పెద్ద స్టారయితే మీకు దొరకడని మీ బాధ… అయినా.. అతని మొహమాటాన్ని అడ్డుపెట్టుకుని అతనికి ఉన్న కొంచెం ఇమేజ్‌నీ ఇలా ఎడా పెడా వాడేయకండి మరి!

ఎన్.ఎన్.ఎక్స్పీరియన్స్ ఫిలిమ్స్ విట్టల్ వాడి మూవీ “అన్న వదిలేసిండు” లిరికల్ వీడియో సాంగ్ ని రిలీజ్ చేసిన హీరో కార్తికేయ
రోహిత్,సుధా రావత్ హీరో హీరోయిన్లు గా ఎన్.ఎన్.ఎక్స్పీరియన్స్ ఫిలిమ్స్  బ్యానర్ లో జి.నరేష్ రెడ్డి నిర్మించిన చిత్రం  విట్టల్ వాడి. ఈ మూవీలో “అన్న వదిలేసిండు” లిరికల్ వీడియో సాంగ్ లాంచ్ RX 100  ఫేం హీరో కార్తికేయ గారు గారి చేతుల మీదుగా జరిగింది. ఈ సందర్బంగా హీరో కార్తికేయ మాట్లాడుతూ… అన్న వదిలేసిండు సాంగ్ చాలా బావుంది.చిత్ర యూనిట్ కి బెస్ట్ విషెస్ చెప్తున్నాను – అన్నాడు.

తెలుగు రాపర్ రోల్ రైడా మాట్లాడుతూ…
విట్టల్ వాడి మూవీ లో అన్న వదిలేసిండు సాంగ్ లిరిక్స్ రాసి సాంగ్ పాడటమే కాకుండా యాక్ట్ చేయడం జరిగింది.మాస్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతుంది అని చెప్పారు. తనకి ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ కి ప్రొడ్యూసర్ కి థాంక్స్ చెప్పారు.

హీరో రోహిత్ మాట్లాడుతూ… రోల్ రైడా అన్న కి స్పెషల్ థాంక్స్.రోల్ రైడా పాడిన ఈ సాంగ్ సూపర్ హిట్ అవుతుంది అని చెప్పారు.
ప్రొడ్యూసర్ జి.నరేష్ రెడ్డి మాట్లాడుతూ… 90 ml షూటింగ్ లో బిజీ గా ఉండి కూడా మా లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్ చేయడానికి వచ్చిన హీరో కార్తికేయ గారికి చాలా థాంక్స్.ఈ సాంగ్ అందరికి నచ్చుతుందని సాంగ్ ని సూపర్ హిట్ చేయాలని అందరిని కోరుకుంటున్నా అని చెప్పారు.

నటీనటులు:
రోహిత్ రెడ్డి, సుధా రావత్,అమిత్,అప్పాజీ అంబరీష్ దర్బా,చమ్మక్ చంద్ర,జయ శ్రీ,రోల్ రైడా,
సాంకేతిక నిపుణులు:
కెమెరామెన్:సతీష్ అడపా
మ్యూజిక్:రోషన్ కోటి
ఎడిటర్:శ్రీనివాస్ కె.మోపర్తి
ఫైట్స్:శంకర్.యు
పిఆర్ఓ:మధు వి.ఆర్
లిరిక్స్& సింగర్: రోల్ రైడా
లైన్ ప్రొడ్యూసర్:ప్రశాంత్ పేరుపల్లి
నిర్మాత:నరేష్ రెడ్డి.జి
డైరెక్టర్:నాగేందర్.టి

62 / 100 SEO Score

This post is also available in: ఇంగ్లిష్‌


ADVERTISE HERE