అందం ప్లస్‌ అదృష్టం = ఆషిమా


ఇన్‌స్టాగ్రామ్‌లోనే కాదు, కాలీవుడ్‌లో కూడా ఈ మధ్య తెగ పాపులర్‌ అవుతున్న హీరోయిన్‌ ‘కిల్లర్‌’ సినిమా ఫేమ్‌ ఆషిమా నర్వల్‌. విజయ్‌ ఆంటోనీ నటించిన ‘కిల్లర్‌’ సినిమాతో ఆషిమాకు మంచి క్రేజ్‌ లభించింది. అంతకుముందు ఆమె నటించిన జెస్సీ సినిమాతో గుర్తింపు వచ్చింది. ఆ సినిమా రిలీజయిన తరవాత – హిట్‌ టాక్‌ వచ్చి, అదనంగా 25 థియేటర్లు పెంచారట. అదే ట్రెండ్‌ ‘కిల్లర్‌’ సినిమాతోనూ కొనసాగింది. రిలీజ్‌ తరవాత ఈ సినిమాకి – ముందు అనుకున్న థియేటర్ల కంటే మరో 60 థియేటర్లు పెంచాల్సి వచ్చింది. దాంతో ఇదో సెంటిమెంట్‌గా మారిపోయి ఆషిమా నర్వల్‌ అక్కడ ఓ లక్కీ స్టార్‌గా గుర్తింపు పొందుతోంది. కాలీవుడ్‌లో అప్పుడే కొందరు ప్రొడ్యూసర్లూ, డిస్ట్రిబ్యూటర్లూ ఈ అమ్మాయికి ‘గోల్డెన్‌ హీరోయిన్‌’ అని బిరుదిచ్చేశారట. డబ్బూ, సక్సెస్‌ల చుట్టూ తిరిగే సినిమా రంగంలో ఇలాంటి ‘గోల్డెన్‌ లెగ్‌’, ‘ఐరన్‌ లెగ్‌’ లాంటి బిరుదులు మామూలే!

అయితే ఆషిమా నర్వల్‌ తెలుగులో ఇంతకుముందు ‘నాటకం’ అనే సినిమాలో చేసింది. కానీ ఆమెకు ఎలాంటి గుర్తింపూ రాలేదు. అయితేనేం, ఒకసారి ముద్ర పడ్డాక మనోళ్లు కూడా లక్కీ స్టార్‌, లక్కీ ఛార్మ్‌ అంటూ ఆషిమా చుట్టూ చేరుతున్నారు. పాత్రలు ఆఫర్‌ చేస్తున్నారు. టైమండీ, టైము!

This post is also available in: ఇంగ్లిష్‌


ADVERTISE HERE