Mi A2… ఎమ్‌ఐ ఫోన్లో ప్యూర్‌ యాండ్రాయిడ్‌?

PremaLekhalu

లేటెస్ట్‌గా Mi ఫోన్‌ల సిరీస్‌లో వచ్చిన Mi A2 ఫోన్ … 5.99 అంగుళాల టచ్ స్క్రీన్ కలిగి, జనాన్ని ఎంతగానో ఆకర్షిస్తోంది. 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 4 GB RAM, 64 GB ఇంటర్నల్ స్టోరేజ్‌ .. దీని స్పెసిఫికేషన్స్! అయితే దీన్ని వాళ్లు ‘పిక్చర్ పెర్‌ఫెక్ట్ కెమెరా’గా ఫోకస్ చేస్తున్నారు. దీనిలో 20 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. వెనుకవైపు 12 మెగా పిక్సెల్ ప్లస్ 20 మెగా పిక్సెల్ డ్యూయెల్ కెమెరా ఉంది. అంటే మొత్తం 3 కెమెరాల కింద లెక్క! అలాగే ఫ్రంట్ కెమెరాతో మనం సెల్ఫీలు తీసేటప్పుడు అవి అందంగా వచ్చేలా ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ మీద ఆధారపడిన బ్యూటిఫై ఫీచర్ 4.0 వర్షన్ ఉంది.

ముఖ్య విషయం ఏమిటంటే – ఈ ఫోన్లో వాడిన ఆపరేటింగ్ సిస్టమ్‌ … మామూలుగా Mi ఫోన్లలో వాడే MiUI కాదు. ఆండ్రాయిడ్ వన్‌. గూగుల్ వాళ్లు ఎలాంటి థర్డ్ పార్టీ యాప్స్, సిస్టం యాప్స్ గానీ కలపకుండా ఇచ్చే ఆపరేటింగ్ సిస్టమ్‌.. ఈ ఆండ్రాయిడ్ వన్‌. వాళ్ల భాషలో చెప్పాలంటే – ఇది స్వచ్ఛమైన ఆండ్రాయిడ్ OS అన్నమాట. ఏ ఫోన్ కంపెనీ అయినా సరే ఒక ఆండ్రాయిడ్ ఫోన్ తయారు చేసి జనంలోకి పంపేటప్పుడు – తమ ప్రొప్రయిటరీ యాప్స్ కొన్నిటిని ఇన్‌స్టాల్ చేసి ఇస్తాయి. ఉదాహరణకు సోనీ వాళ్లు ఆండ్రాయిడ్ ఫోన్ అమ్మితే అందులో – సిస్టమ్‌ యాప్స్‌గా డిఫాల్ట్‌గా కొన్ని సోనీ యాప్స్ ఉంటాయి. అంటే.. ఆపరేటింగ్ సిస్టమ్‌ లోనే సోనీ తాలూకు సౌకర్యాలన్నిటినీ కలిపి ప్రత్యేకమైన custom ROM తయారుచేసి దానినే ఫోన్స్‌ లో ఇస్తారు. నిజానికి ఈ custom యాప్స్ అన్నీ చేర్చి సౌకర్యం అంటారు గానీ.. నిజానికి ఇవి చాలా పెద్ద అసౌకర్యం. వాటిని మనం తొలగించలేం. కేవలం ప్రమోషన్‌ కోసం యాడ్‌ చేసే అనవసరమైన యాప్స్‌ వాటిలో ఎన్నో ఉంటాయి. అవన్నీ మన ఇంటర్నల్ మెమరీని అవి తినేస్తున్నా మనం భరించాల్సి ఉంటుంది. లేదంటే ఫోన్‌ ని రూట్‌ చేసి మనకు నచ్చిన రామ్‌ని ఇన్‌స్టాల్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది రిస్క్‌తో కూడిన పని!

కాబట్టి – ఇలా ఫోన్‌ కంపెనీల తాలూకు కస్టమ్‌ రామ్స్‌ తో సమస్యలు లేకుండా ప్యూర్ ఆండ్రాయిడ్ వాడండి అని గూగుల్ వాళ్లు అప్పుడప్పుడూ ఆండ్రాయిడ్ వన్‌ని ప్రమోట్ చేస్తుంటారు. సోనీ ఫోన్లలో యాండ్రాయిడ్‌ సోనీయాప్స్‌ తో కలుషితం అయినట్లే – యాండ్రాయిడ్‌ వన్‌ అన్నది సహజంగానే అంతా గూగుల్‌ యాప్స్‌ తో నిండిపోయి ఉంటుంది. మరి Mi ఫోన్లలో మామూలుగా ఇచ్చే MiUI ఆపరేటింగ్‌ సిస్టమ్‌ ని వదిలేసి – యాండ్రాయిడ్‌ వన్‌ ఇవ్వడం వల్ల ప్రత్యేక ప్రయోజనం ఏమిటి? నిజానికి Mi ఫోన్లన్నవి Mi ROM వల్లే ఎక్కువ విజయం సాధించాయని చెప్పవచ్చు. MiUI లో డిఫాల్ట్‌గా ఎన్నో సౌకర్యాలు మనకి దొరుకుతాయి. ప్యూర్ ఆండ్రాయిడ్‌తో ఫోన్ రిలీజ్ చెయ్యడం వల్ల ఆ సౌకర్యాలన్నీ మనకి లభించవు. సరే, MiUI కి అలవాటు పడ్డ జనం – ప్యూర్‌ యాండ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ ఉన్న ఈ Mi ఫోన్‌ ని ఎంతవరకూ ఆదరిస్తారో చూద్దాం!

This post is also available in: enఇంగ్లిష్‌


PremaLekhalu