హిందీ ప్రస్థానం ఫస్ట్ లుక్ విడుదల..!

PremaLekhalu

శర్వానంద్, సాయి కుమార్ ప్రధాన పాత్రల్లో డైరెక్టర్ దేవా కట్టా తెలుగులో రూపొందించిన చిత్రం ‘ప్రస్థానం’. ఈ సినిమా అప్పట్లో విజయం సాధించడమే కాదు విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. ఇప్పుడు ఈ సినిమాని దేవా కట్టా హిందీలో తెరకెక్కిస్తున్నాడు. సంజయ్ దత్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసింది చిత్రం. తెలుగు సినిమా మాదిరిగానే ఈ సినిమాలో కూడా పవర్ ఫుల్ డైలాగులు ఉన్నట్లు చెప్పకనే చెప్పాడు డైరెక్టర్ దేవా కట్టా.

అలీ ఫైసల్, అమైరా దస్తూర్ హీరో హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని సంజయ్ దత్ నిర్మిస్తున్నాడు. ఈ చిత్రం గురించి పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడించనుంది చిత్ర యూనిట్.


PremaLekhalu