హలో నేనే! ఫలానా బ్యాంక్‌ రోబోట్‌ని మాట్లాడుతున్నా!

F2 Movie
Is Robotics the Future of Banking and Finance

త్వరలో బ్యాంకింగ్‌ రంగంలోకి రోబోట్స్ వస్తున్నాయట! ఇవి మాట్లాడే రోబోట్స్‌! ఫైనాన్షియల్‌ రోబోట్స్‌! అవునండీ! ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ కలిగి ఉండి, బ్యాంక్‌ కస్టమర్లకి బ్యాంకుల్లోనూ ఫోనుల్లోనూ బ్యాంకింగ్‌ సలహాలిస్తాయట ఈ రోబోట్లు!

ఒక‌ప్పుడు బ్యాంక్ అకౌంట్లు క‌లిగి ఉన్న వాళ్లు చాలా త‌క్కువ మంది ఉండే వారు. మొన్న మొన్న మోదీగారు డీ మోనిటైజేష‌న్ చేయ‌నంత వ‌ర‌కూ కూడా సామాన్యులెవ‌రూ బ్యాంక్ అకౌంట్లు లేకుండానే ఆర్థిక లావాదేవీల‌ను నిర్వ‌హించటం జ‌రిగేది. అయితే అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే ఇప్పుడు కూడా ఇండియాలో బ్యాంక్ అకౌంట్లు కలిగిఉన్నవాళ్ల శాతం చాలా తక్కువ. అయినప్పటికీ – గ‌తంతో పోలిస్తే బ్యాంకింగ్ అనేది విప‌రీతంగా పెరిగింది. ఒక‌ప్పుడు క‌స్ట‌మ‌ర్లు త‌క్కువ‌గా ఉండ‌టం వల్ల మన బ్యాంకులు ప్ర‌తి క‌స్ట‌మ‌ర్ తాలూకు బ్యాంకింగ్ అవ‌స‌రాల గురించి విడివిడిగా తెలుసుకుని తగినంత శ్ర‌ద్ధ తీసుకునేవి. ప్ర‌తి క‌స్ట‌మ‌ర్ తోనూ వ్యక్తిగతంగా మాట్లాడి, వారి అవ‌స‌రాలేంటి? స‌మ‌స్య‌లేంటి? అని తెలుసుకుని కస్టమర్‌ కేర్‌ వాళ్లు వాళ్లకి కావాల్సిన స‌ల‌హాలు ఇచ్చేవారు. బ్యాంక్ అకౌంట్లు నిర్వ‌హించుకోవ‌డం ప‌రంగా, ఇన్వెస్టిమెంట్స్ ప‌రంగా, ఇన్సూరెన్స్ లాంటి వాటి విషయంలోనూ, అలాగే షేర్ల విష‌యంలోనూ, పొదుపు చేసే వారికి ఏది లాభక‌రం, ఏది కాద‌ని స‌ల‌హాలివ్వ‌డంలోనూ.. ఇలా ఫైనాన్షియ‌ల్ రంగంలో అన్ని చోట్లా ఒక విధ‌మై ప‌ర్స‌న‌ల్ ట‌చ్ అనేది ఉండేది.

అయితే రాను రానూ క‌స్ట‌మ‌ర్లు పెరిగిపోయి, అస‌లు వాళ్ల‌తో ఒక్క నిమిషం కూడా మాట్లాడే తీరిక కూడా బ్యాంకుల‌కు లేకుండా పోయింది. అందువ‌ల్ల బ్యాంక్ అనేది ఇప్పుడు కేవలం ఏదో ఒక అవ‌సరంగా ఉందే త‌ప్ప- దానితో మనకి ఏ విధంగానూ ఆత్మీయమైన బంధం అనేది ఏమీ లేదు. ఇప్ప‌డు ఈ గ్యాప్ ను ఫిల్ చేయ‌డం కోసం రోబోట్ల‌ను వాడే ఆలోచ‌న చేస్తున్నాయి యూఎస్ లో బ్యాంకులు.

కృత్రిమ మేధ ( ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌) సాయంతో ప్ర‌తి ఒక్క‌రితో ప‌ర్స‌న‌ల్ గా టచ్ లోకి వ‌చ్చి ,వారికి కావాల్సిన ఆర్థిక స‌ల‌హాల‌న్నీ ఇస్తూ.. క‌స్ట‌మ‌ర్ల‌కూ బ్యాంకుల‌కూ కూడా లాభ‌క‌రంగా ఉండేలా ఫైనాన్షియల్‌ రోబోట్లు ప‌నిచేస్తాయ‌ట‌. తొలి ప్రయోగాలు స‌క్సెస్ అయితే – అంత‌ర్జాతీయంగా రాను రాను ఫైనాన్స్ రంగంలో రోబోట్ల వాడ‌కం మ‌రింత పెరుగుతుంద‌ని ఆర్థిక నిపుణులు అంటున్నారు. చూద్దాం, మ‌న ఇండియాకి కూడా ఇలాంటి ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెంట్ రోబోట్స్ వ‌చ్చి, గొప్ప గొప్ప ఆర్థిక స‌ల‌హాలు ఇచ్చి, ఆర్థికపరమైన జ్ఞానాన్ని పెంచి, మనవాళ్ల ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తాయేమో… వేచి చూద్దాం!

This post is also available in: enఇంగ్లిష్‌


PremaLekhalu