స్పీడ్‌ డెలివరీ విషయంలో అమెజాన్‌వన్నీ కోతలే!

F2 Movie
Amazon's Speed Delivery... True Or Tempting Hype?

మీరు అమెజాన్ డాట్‌ కామ్‌ కస్టమరా? అయితే డిమాండ్ ఎక్కువగా ఉన్న మంచి మంచి ఎలక్ట్రానిక్ వస్తువుల్ని కూడా మీరు అమెజాన్ లో కొంటూ ఉండొచ్చు. మీరు ప్రైమ్ మెంబర్ అయితే – సాధారణ మెంబర్ల కంటే మీకు విలువైన సర్వీసులు అందుతాయని మీరు భావిస్తూ ఉండవచ్చు, అయితే కొన్న వస్తువుని తొందరగా అందించటం, ఫ్రీ షిప్పింగ్ సౌకర్యం, లేదా షిప్పింగ్ రేట్లలో డిస్కౌంట్ – ఇలాంటివన్నీ అమెజాన్ ప్రైమ్ మెంబర్లకు ఇతరులకంటే అదనంగా లభించే సౌకర్యాలంటూ అమెజాన్ చెబుతుంటుంది. కానీ ఇవన్నీ చాలాసార్లు ప్రగల్భాలుగా మిగిలిపోతున్నాయి.

ఉదాహరణకి కొన్ని వస్తువులు కొనేటప్పుడు మీరు లాగిన్ అయి సెర్చ్ చేస్తుంటే మీరు ప్రైమ్ మెంబర్ కాబట్టి అక్కడ ‘ప్రైమ్’ అని చిన్న లోగో వస్తుంది. ఆలా లోగో వచ్చి ‘ఫ్రీ డెలివరీ బై టుమారో’ అనిగానీ లేదా సేమ్ డే డెలివరీ అనిగానీ వచ్చి డెలివరీ టైమ్‌ లిమిట్‌ కనిపిస్తుంది. అది మాత్రమే కాదు- ఇదిగో.. ఇన్ని గంటల, ఇన్ని నిమిషాల లోపులో మీరు ఆర్డర్ ఇస్తే – చాలా చాలా త్వరగా… రేపుగానీ లేదా ఈరోజే మీకు పంపించేస్తాం అని చెప్పే ఓ టైమ్‌ కౌంట్‌ డౌన్‌ డిస్‌ప్లే కనిపిస్తుంది. మరి ఆ మాట నమ్మి టెంప్ట్‌ అయి నిజంగా వస్తువు కొంటే? ఆ చెప్పిన విధంగానే ఆ ఒక్కరోజులోనే లేదా అదే రోజున వాళ్ళు డెలివరీ చేయగలుగుతారా? – అంటే చాలాసార్లు కాదనే చెప్పాల్సి వస్తుంది. “మీరు ఒక్క గంటలోపు ఆర్డర్ ఇస్తే ఇది ఈరోజు రాత్రే మీ ఇంటికొస్తుంది” అన్నంత స్థాయిలో చూపిస్తారు గానీ, నిజానికి అది కేవలం కస్టమర్ ని టెంప్ట్ చేయడానికి కోసం వాడే ట్రిక్‌ మాత్రమే అని అనుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే నిజంగా – వాళ్లు అలా సూచించిన విధంగా ఆ గంటలోపునే మనం వస్తువుని ఆర్డర్‌ చేసేసినా వాళ్లు మరీ తొందరేమీ పడరు. రెగ్యులర్‌ గా అమెజాన్‌ వస్తువులు ఏ వేగంతో అందిస్తారో దాదాపు అదే వేగంతో ఇస్తారు. అంటే చెప్పిన విధంగా ఆ వస్తువు ఆ రోజు వచ్చే అవకాశం లేదు. ఎందుకిలా?

ప్రైమ్‌ వీడియోలూ షిప్పింగ్‌ రేట్‌ డిస్కౌంట్ల సంగతి పక్కన పెడితే – వస్తువుల డెలివరీ పరంగా మాత్రం అమెజాన్ ప్రైమ్ అన్నది – తెలంగాణాలో – ముఖ్యంగా హైదరాబాద్ లో అట్టర్‌ ప్లాప్ అని చెప్పి తీరాలి. ఎప్పటినుంచో ఈ లోపం ఉంది. ఎంత ఇంటర్నేషనల్‌ కంపెనీ అయినా – అమెజాన్ లోకల్‌ ఏజెంట్ల నిర్లక్ష్యాన్ని జయించలేకపోతోంది. ఇప్పటికీ డెలివరీ స్పీడ్‌ని మెరుగుపరిచే చర్యల్ని తీసుకోలేకపోతుంది.

కాబట్టి అమెజాన్ లో మీరేదయినా వస్తువుకొనేటపుడు ఆలోచించండి. ” ఇదుగో ఈ లోపులో కొనేస్తే ఇంత త్వరగా పంపించేస్తాం! ” అని ఆశపెట్టే ఆప్షన్‌ కనిపిస్తే – కేవలం ఆ పాయింట్‌ కోసం మీరు టెంప్ట్ అయిపోకండి. అవి కేవలం శ్రీశ్రీశ్రీ అమెజాన్‌ వారి ప్రగల్భాలు మాత్రమే! కచ్చితంగా డెలివరీకి మాములుగా ఎంత సమయం పడుతుందో వాటికి కూడా అంతే సమయం పడుతుందని మీరు గుర్తించాలి.

This post is also available in: enఇంగ్లిష్‌


PremaLekhalu