సెంటిమెంట్‌ బద్దలుగొట్టిన ‘చినబాబు’?

F2 Movie
Did 'Chinababu' Broke the Sentiment?

ఈ మధ్య సెంటిమెంట్ ఉండే సినిమాలు బాగా తగ్గిపోయాయి. కానీ సినిమావాళ్ళకి మాత్రం సెంటిమెంట్స్ ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. మన తెలుగు సినిమా టైటిల్స్ విషయంలో ఎప్పటినుంచో ఒక చిన్న సెంటిమెంట్‌ ఏంటంటే టైటిల్ లో ‘చిన్న’ లేదా ‘చిన’ అని వస్తే – ఆ సినిమా హిట్ అయ్యే అవకాశం లేదని! అలాగే పెద్ద అని వస్తే – ఆ సినిమా హిట్ అవుతుందని కూడా సెంటిమెంట్ ఉంది. మోహన్‌ బాబు పెదరాయుడు హిట్ … వెంకటేష్‌ చినరాయుడు ప్లాప్‌, బాలకృష్ణ పెద్దన్నయ్య హిట్, నాగార్జున చినబాబు ప్లాప్, జగపతి బాబు పెదబాబు హిట్‌, వెంకటేష్ చిన్నబ్బాయి ఫ్లాప్‌… ఇలా ఈ సెంటిమెంట్‌ ని సపోర్ట్‌ చేసే లిస్ట్‌ చాలా పెద్దదే ఉంది. ఆఖరికి సుమంత్ సినిమా ‘చిన్నోడు’ స్టోరీ బాగున్నా అట్టర్‌ ఫ్లాప్‌. ఇలా ఉదాహరణలు చెబుతూ పోతే పెద్ద, పెద పదాలు హిట్‌ వైపు, చిన్న, చిన అన్నవి ఫ్లాప్‌ వైపు చేరతాయి. అయితే ఇప్పుడు కార్తి సినిమా చినబాబు వచ్చింది. హిట్‌ అనిపించుకుంది. రైతు బ్యాక్ గ్రౌండ్ తో వచ్చిన ఈ సినిమా కార్తికి కూడా మంచి పేరు తీసుకొచ్చింది. అఖిల్‌ సినిమాతో సక్సెస్‌ సాధించలేని సాయేషా ఈ సినిమాతో ఓకే అనిపించుకుంది. మరి ఈ ‘చిన్న-ఫ్లాప్’ అనే పాత సెంటిమెంట్‌కి కాలం చెల్లినట్లేనా?

కార్తి ‘చినబాబు’ హిట్‌ అయినా ఈ సెంటిమెంట్‌ ఏమీ దెబ్బ తినదు, పైగా బలపడుతుంది – అంటున్నారు సెంటిమెంట్‌ వాదులు. ఎందుకట? ‘చిన్న’ అనే సెంటిమెంట్‌ డైరెక్ట్‌ సినిమాలకే తప్ప – డబ్బింగ్‌ సినిమాలకి చెల్లదట. చినబాబు డైరెక్ట్‌ తెలుగు సినిమా కాదు. ఈ’కడైక్కుట్టి సింగం’ అనే తమిళ సినిమాకి డబ్డ్‌ వెర్షన్‌ ఇది!
తమ వాదనకి బలం చేకూర్చుకోవడానికి గతంలోంచి ఉదాహరణలు ఇస్తున్నారు. గతంలో భాగ్యరాజ్ తమిళంలో తీసిన ‘చిన్న వీడు’ సినిమా తెలుగులోకి డబ్‌ అయి ‘చిన్న ఇల్లు’ పేరుతో వచ్చింది. హిట్‌ అయింది. అలాగే భాగ్యరాజా తమిళ సినిమాయే … ‘ఎంగ చిన్న రాజా’ ని కూడా ‘ చిన్న రాజా’ పేరుతో డబ్‌ చేసి వదిలితే వందరోజులాడింది. దాన్నే మళ్లీ తెలుగులో డైరెక్ట్‌ గా తీసినా దానికి ‘చిన్న రాజా’ అని పేరు పెట్టకుండా – ‘అబ్బాయిగారు’ అని పేరు పెట్టారు. అది హిట్‌ అయింది. విజయకాంత్‌ నటించిన ‘చిన్న గౌండర్’ సినిమాని ‘చిన రాయుడు’గా తెలుగులోకి రీమేక్ చేస్తే అట్టర్ ప్లాప్ అయ్యింది.
ఏమైనా సినిమా అంటేనే సెంటిమెంట్… వ్యాపారం ఉన్న ప్రతిచోటా సెంటిమెంట్ అనేది ఉంటుంది. సో… డబ్బింగ్‌ సినిమాలకి హిట్స్‌ ఇచ్చే ‘చిన్న/చిన’ పదం – డైరెక్ట్‌ సినిమాలకి, రిమేక్‌ సినిమాలకి మాత్రం అచ్చిరాదన్న ఈ సినీ విశ్లేషకుల సెంటిమెంట్‌ – ఎప్పుడు బ్రేక్‌ అవుతుందో చూద్దాం మరి!

This post is also available in: enఇంగ్లిష్‌


PremaLekhalu