సూర్య, వెంకీ కలయికలో చిత్రం..?

PremaLekhalu

సీనియర్ హీరో వెంకటేష్ ఈ మధ్య వరస మల్టీ-స్టారర్ చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ఇప్పటికే వరుణ్ తేజ్ తో ఎఫ్2 అనే సినిమా, అక్కినేని నాగ చైతన్య తో కలిసి ఒక చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇది ఇలా ఉంటే త్వరలోనే వెంకటేష్ మరో మల్టీ స్టారర్ చేయనున్నట్లు ఫిలిం నగర్ టాక్.

వివరాల్లోకి వెళితే దర్శకుడు త్రినాధరావు నక్కిన వెంకటేష్ కి ఒక కథ వినిపించాడట. అది వెంకీకి నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చాడని వినికిడి. అయితే ఈ సినిమాలో ఒక స్పెషల్ రోల్ చేయడానికి తమిళ హీరో సూర్య ని ఎంపిక చేయాలనుకుంటున్నారు చిత్ర యూనిట్. ఈ సినిమాని సురేష్ బాబు తన సొంత బ్యానర్ సురేష్ ప్రొడక్షన్స్ మీద నిర్మిస్తారట. మరిన్ని విషయాలు త్వరలోనే వెల్లడించనుంది చిత్ర యూనిట్.


PremaLekhalu