సుడిగాడు సరసన రాజుగాడి హీరోయిన్

F2 Movie

అల్లరి నరేష్, దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు కాంబినేషన్ లో వచ్చిన చిత్రం ‘సుడిగాడు’. ఈ సినిమా అప్పట్లో బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ కు రంగం సిద్ధమైంది. ఇకపోతే ఈ సినిమాలో అల్లరి నరేష్ తో పాటు సునీల్ కూడా మరో హీరోగా నటిస్తున్నాడు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ కాగా సమ్మర్ లో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. నందిని రాయ్ ఈ సినిమాలో హీరోయిన్ గా ఎంపిక కాగా మరో హీరోయిన్ గా ‘రంగుల రాట్నం’ ఫేమ్ చిత్రా శుక్లా ని ఎంపిక చేసింది చిత్ర యూనిట్. ఈ సినిమాని పూర్తి పల్లెటూరి నేపథ్యంలో తీస్తాడట దర్శకుడు. టాలీవుడ్ కమెడియన్స్ అందరూ కూడా ఇందులో కీలక పాత్ర పోషించబోతున్నారు.

This post is also available in: enఇంగ్లిష్‌


PremaLekhalu