బెల్లంకొండ ‘సాక్ష్యం’ కూడా వరల్డ్ వైడ్ రిలీజే!

F2 Movie
EROS International takes over Saakshyam

ఇప్పుడు ఏ కాస్త ఖర్చుపెట్టినా – ఆ సినిమాని ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేస్తున్నామంటూ ఆర్భాటం ఎక్కువయింది.  అసలే తన స్థాయికి  మించిన హీరోయిన్ల పక్కన వెలిగే – బెల్లంకొండ హీరో చిత్రమాయె! మరి పెద్ద లెవెల్లో రిలీజ్ చేయకుండా ఉంటారా? పూజా హెగ్డే హీరోయిన్ గా తెరకెక్కిన ‘సాక్ష్యం’ చిత్రం ఈనెల జూలై 27న విడుదలకు సిద్ధమవుతుండగా.. ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేయాలని నిర్ణయించారు. ఆ హక్కుల్ని పెద్ద నిర్మాణ సంస్థ ‘ఎరోస్’ కి అప్పగించారు. బాలీవుడ్ లోనే కాక పలు ప్రతిష్టాత్మక తెలుగు చిత్రాలను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసిన ఎరోస్ ఇప్పుడు ‘సాక్ష్యం’ హక్కులు కూడా తీసుకోవడం విశేషం.
అభిషేక్ పిక్చర్స్ పతాకంపై అభిషేక్ నామా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ డిఫరెంట్ యాక్షన్ ఎంటర్ టైనర్ ను దర్శకుడు శ్రీవాస్ తెరకెక్కించిన తీరు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందట. వైవిధ్యమైన కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ చిత్రం ట్రైలర్ కి కూడా విశేషమైన స్పందన లభించిందని అంటున్నారు. బెల్లంకొండ శ్రీనివాస్ ఎలాంటి డూప్ లేకుండా పీటర్ హెయిన్స్ మాస్టర్ నేతృత్వంలో చేసిన రిస్కీ స్టంట్స్, పూజా హెగ్డే క్యారెక్టరైజేషన్, జగపతిబాబు క్యారెక్టరైజేషన్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిపడేస్తాయట. మరి అన్నిటికంటే ముఖ్యంగా.. శ్రీవాస్ చాలా డిఫరెంట్ స్టోరీతో ఈ చిత్రాన్ని తెరకెక్కించిన విధానం ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరుస్తుందని రాసేస్తున్నారు. చూద్దాం.  బెల్లంకొండ శ్రీనివాస్ కెరీర్ లో ‘సాక్ష్యం’ ఓ మైలురాయిగా నిలుస్తుందన్న చిత్రబృందం మాట… హైపో… లేక సోపో !

This post is also available in: enఇంగ్లిష్‌


PremaLekhalu