శ్రీదేవి పాత్రలో రకుల్

PremaLekhalu

నందమూరి బాలకృష్ణ హీరోగా క్రిష్ డైరెక్షన్ లో రూపొందుతున్న చిత్రం ‘ఎన్టీఆర్’. ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్ర కోసం రకుల్ ప్రీత్ సింగ్ ని ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఇది ఇలా ఉంటే ఆమె ఈ సినిమాలో హీరోయిన్ శ్రీదేవి పాత్రలో కనిపిస్తారట. దీనికి ఆమె అంగీకారం కూడా తెలిపినట్లు వినికిడి. ఇకపోతే సావిత్రి పాత్ర కోసం కీర్తి సురేష్ ని చిత్ర యూనిట్ ఎంపిక చేసిన విషయం తెలిసిందే.

ఈ సినిమాలో ఎన్టీఆర్ సతీమణి బసవతారకం పాత్రలో బాలీవుడ్ హీరోయిన్ విద్యా బాలన్ నటిస్తోంది. ఈ సినిమాపై మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు చిత్ర యూనిట్.


PremaLekhalu