‘శైలజారెడ్డి అల్లుడు’ టాకీ పార్ట్ పూర్తి

PremaLekhalu

మారుతీ దర్శకత్వంలో అక్కినేని నాగ చైతన్య నటిస్తున్న చిత్రం ‘శైలజా రెడ్డి అల్లుడు’. ఈరోజు తో ఒక్క సాంగ్ మినహా ఈచిత్రం యొక్క షూటింగ్ పూర్తయింది. సీనియర్ నటి రమ్య కృష్ణ ముఖ్య పాత్రలో కనిపించనున్న ఈ చిత్రంలో అను ఇమ్మానుఎల్ హీరోయిన్ గా నటిస్తోంది.
గత ఏడాది ‘మహానుభావుడు’ చిత్రంతో మంచి విజయాన్ని ఖాతాలో వేసుకున్న దర్శకుడు మారుతీ ఈ చిత్రాన్ని కూడా పూర్తి కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నాడట. గోపిసుందర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తుంది. ఇకపోతే ఈ చిత్రం ఆగష్టు 31 న విడుదల కానుందని చిత్ర వర్గాల సమాచారం.


PremaLekhalu