శింబు చిత్రంలో జాన్వీ కపూర్..?

F2 Movie

శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ‘దఢక్’ అనే సినిమాతో బాలీవుడ్లో అరంగ్రేటం చేయబోతోంది. ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఇది ఇలా ఉంటే గత కొద్ది రోజులుగా జాన్వీ కపూర్ తమిళ సినిమా చేయబోతున్నట్లు కొన్ని వార్తలు వస్తున్నాయి.

అసలు విషయం ఏమిటంటే తమిళ హీరో శింబు హీరోగా వెంకట్ ప్రభు ఒక సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ కోసం జాన్వీ కపూర్ ని ఎంపిక చేయాలనీ చూస్తున్నారట చిత్ర యూనిట్. ఇంకా దీనిపై ఎటువంటి అధికారక ప్రకటన రాలేదు. ఇకపోతే ఈ సినిమాలో హీరోయిన్ గా కీర్తి సురేష్ ఎంపికైనట్లు గతంలో పుకార్లు కూడా వచ్చాయి. రెండిట్లో ఏది నిజమో తెలియాలంటే కొద్దీ రోజులు ఆగాల్సిందే.


PremaLekhalu