శర్వానంద్ సరసన అఖిల్ బ్యూటీ

F2 Movie

అక్కినేని అఖిల్ హీరోగా వచ్చిన రెండో చిత్రం ‘హలో’. ఈ సినిమాకు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయమే దక్కినా కమర్షియల్ గా హిట్ కాలేకపోయింది. ఇకపోతే ఈ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయింది కళ్యాణి ప్రియదర్శన్. ఈమె ప్రముఖ తమిళ డైరెక్టర్ ప్రియదర్శన్, మాజీ నటి లేజీ కుమార్తె. ‘హలో’ సినిమా హిట్ అవ్వకపోయినా ఈమె నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి.
ప్రస్తుతం ఈమెకు టాలీవుడ్ లో ఒక యంగ్ హీరో సరసన నటించే ఛాన్స్ వచ్చిందని తెలుస్తోంది. అసలు విషయంలోకి వెళ్తే యంగ్ హీరో శర్వానంద్ సుధీర్ వర్మ డైరెక్షన్ లో ఒక సినిమా చేయనున్నాడు. ఇక ఈ సినిమాలో హీరోయిన్లు గా కాజల్ అగర్వాల్, నిత్యా మీనన్ ను ఎంపిక చేశారని ఆ మధ్య టాక్ కూడా వినిపించింది.
ఇక ఇప్పుడు నిత్యా మీనన్ విషయంలో చిత్ర నిర్మాతలకు తేడా రావడంతో ఆ పాత్ర కోసం సాయి పల్లవి ని అనుకున్నారట. ఆమె హను రాఘవపుడి డైరెక్షన్ లో శర్వానంద్ హీరోగా ఒక సినిమా చేస్తుండడం వల్ల చిత్ర నిర్మాతలు కళ్యాణి ని అప్ప్రోచ్ అయ్యారని వినికిడి. దర్శకుడు సుధీర్ వర్మ కూడా దాదాపు ఫైనల్ చేశారట. దీనిపై ఇంకా అధికారక ప్రకటన రావాల్సి ఉంది. ఈ ప్రాజెక్ట్ మరికొన్ని రోజుల్లో సెట్స్ మీదకు వెళ్ళనుంది.

This post is also available in: enఇంగ్లిష్‌


PremaLekhalu