శకుని మామ గురించి మనకు తెలియని కొన్ని నిజాలు..!

F2 Movie

శకుని, ఈ పేరు గురించి పెద్దగా చెప్పక్కర్లేదు అనుకుంటా… మహాభారత యుద్ధం జరగడానికి మూల కారణం ఆయనే. అంతేకాదు ఆయనకంటూ పెద్ద చరిత్రే ఉందని చెప్పాలి. గంధర్వ రాకుమారుడు, గాంధారికి అన్న అయిన శకుని శివ భక్తుడు అని మీకు తెలుసా..? మహాభారతం ద్వారా శకుని యొక్క కుళ్ళు కుతంత్రాలు మాత్రమే మీకు తెలుసు అనుకుంటా కానీ ఆయన గురించి తెలుసుకోవడానికి చాలా ఉంది. మీకు ఒకటి చెప్పనా పాచికలు ద్వారా రాజ్యాలు గెలుచుకునే తెలివి, సామర్ధ్యం ఒక్క శకుని మామలో మాత్రమే ఉంది అనడంలో నిజం లేకపోలేదు. రండి ఆయన గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం..!

1. శకుని మామకు ఇద్దరు కుమారులు:

ఉలూక, వ్రికాసుర ఆయన కుమారులు. తన తండ్రి శకుని ని ఉలూక గంధర్వ రాజ్యానికి తీసుకు రావడానికి ఎంత ప్రయత్నించినా శకుని భీష్మ పితామహ, కురు వంశాన్ని చంపాలని వేసుకున్న తన ప్రతిజ్ఞ కోసం వెనక్కి తిరిగి వెళ్ళలేదు.

2. శకుని మామకు వందమంది సోదరులు:

సుబాల రాజుకు శకుని మామ వందవ కొడుకు. ఆయనకు 99 మంది సోదరులు, ఒక సోదరి ఉన్నారు. అందరిలోనూ ఈయన మాత్రమే చాలా తెలివైన వారు.

3. శకుని మామకు పాండవులు మీద చెడు అభిప్రాయం లేదు:

ఇది అత్యంత ఆశ్చర్యకరమైన వాస్తవం. అవును, శకునికి పాండవులపై చెడు భావాలు లేవు. భీష్మ పిటమాకు వ్యతిరేకంగా పగ మాత్రమే ఉంది. తన సోదరిని ఒక అంధుడుకి ఇచ్చి చేశాడు అనే కోపం ఆయన మీద ద్వేషంగా మారింది. అప్పుడే ప్రతిజ్ఞ చేశాడు ఆయనను, ఆయన వంశాన్ని నాశనం చేస్తానని.. చెప్పినట్లే చేశాడు.

4. శకుని మామ ఒక ఇంద్రజాలికుడు:

మహాభారత గ్రంధంలో చెప్పుకోదగ్గ గొప్ప విషయం పాచికలు ఆట. అందులో శకుని ఒక సూత్రధారిగా కనిపిస్తాడు. యుధిష్టర ఆయన అద్భుత మాయలో పడి సర్వం కోల్పోతాడు.

5. శకుని మామ పాచికలు దంతాలతో చేయబడినవి:

శకుని యొక్క పాచికలు తన తండ్రి తొడ ఎముకతో తయారు చేయబడినట్లు అందరూ నమ్ముతారు, కానీ వాస్తవానికి ఇది దంతాలతో తయారు చేయబడింది. దీని కారణం గానీ ఆయన అన్ని మాయలు చేశారు.

6. శకుని మామ సహదేవుడి చేతిలో మరణించాడు:

మహాభారత యుద్ధం యొక్క 18 వ రోజున సహదేవుడు శకుని మామను హతమార్చాడు. నిండు సభలో ద్రౌపదికి జరిగిన అవమానం వల్ల సహదేవుడు శకుని మీద పగతీర్చు కొన్నాడు . శకుని ని చంపడానికి ప్రతిజ్ఞ చేశాడు.

7. కేరళలో శకుని మామని పూజించడానికి ఆలయం ఉంది:

రావణుడిలో ఎలా కొన్ని మంచి గుణాలు ఉన్నాయో.. అలాగే శకునిలో కూడా ఉన్నాయి. కేరళలోని కొల్లం జిల్లాలోని కురువర్ సమాజం, శకుని యొక్క మంచి లక్షణాలను గుర్తించి, గౌరవ సూచకంగా పవిత్రేశ్వరం గ్రామంలో ఆయనకు ఒక ఆలయం కట్టారు.


PremaLekhalu