శంకరా.. ఇప్పటికైనా కరుణించావా..!

SriRamaNavami

రజినీకాంత్, శంకర్ కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘2.0’. ఈ సినిమా రోబో చిత్రానికి సీక్వెల్. ఇకపోతే ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అనుకున్న ప్రకారం ఇప్పటికే రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం వి.ఎఫ్.ఎక్స్ వర్క్ లేట్ అవడంతో రిలీజ్ వాయిదా పడుతూ వస్తోంది.

ఇది ఇలా ఉంటే తాజాగా డైరెక్టర్ శంకర్ ఈ సినిమా రిలీజ్ డేట్ ని ట్విట్టర్ ద్వారా అధికారకంగా ప్రకటించారు. ఈ సినిమా నవంబర్ 29 న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అమీ జాక్సన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ విలన్ గా నటిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ సంస్థ ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

This post is also available in: enఇంగ్లిష్‌


PremaLekhalu