వై.ఎస్.జగన్ పాత్రలో చినబాబు..!

PremaLekhalu

దివంగత నేత వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘యాత్ర’. ఈ సినిమాలో మలయాళం హీరో మమ్ముట్టి ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమాని మహి వి రాఘవ డైరెక్షన్ చేస్తున్నాడు. దీనిలో వై.ఎస్.జగన్ పాత్ర కోసం తమిళ నటుడు కార్తీ ని సంప్రదించినట్లు తెలుస్తోంది. ఆయన కూడా ఈ పాత్ర చేయడానికి సముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇంకా దీనిపై అధికారక ప్రకటన రావాల్సి ఉంది. కార్తీ లేటెస్ట్ గా చినబాబు చిత్రంతో మంచి సక్సెస్ అందుకున్నాడు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుండగా ఈ సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేయాలనుకుంటున్నారు నిర్మాతలు. రీసెంట్ గా రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్స్, టీజర్ కి ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించింది.


PremaLekhalu