వెంకీ,వరుణుల ఎఫ్ 2 మొదలైపోయింది!

PremaLekhalu

ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాణంలో సీనియర్ హీరో విక్టరీ ‘వెంకటేశ్‌ , హీరో వ‌రుణ్ తేజ్ ల కలయికలో దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న మ‌ల్టీస్టార‌ర్ చిత్రం ‘ఎఫ్ 2’ ఫ‌న్ అండ్ ఫ్రస్టేష‌న్ ట్యాగ్ లైన్‌ . కొద్ది రోజులు క్రితం మొదలైన ఈ చిత్ర షూటింగ్ మొదటి షెడ్యూల్ నిన్నటితో పూర్తి అయింది.
ఈ షెడ్యూల్ లో అటు హీరోలతో పాటు హీరోయిన్స్ మెహ్రీన్, తమన్నా కూడా పాల్గొన్నారు. పూర్తి కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీత దర్శకుడు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12 న రిలీజ్ కానుంది.


PremaLekhalu