వీళ్ళ మాటలు అమ్మానాన్నలకు నచ్చుతాయా మరి?

F2 Movie

యువతరం మొత్తం మొబైల్లోనే ముఖాలు దాచుకుంటున్న ఈ డిజిటల్ యుగంలో – తల్లితండ్రులకు గౌరవం ఇచ్చే అవకాశం, తీరికా, సంస్కారం – అన్నీ తగ్గిపోయాయి. ఇక పెళ్లి మాటకొస్తే అసలు తల్లితండ్రుల మాటల్ని లెక్క చేసేదే లేదంటోంది నేటి యువతరం. ‘పల్స్ ఆఫ్ ది నేషన్’ పేరిట ఇన్ షాట్స్ అనే యాప్ నిర్వహించిన తాజా సర్వే ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. ఆ సర్వే ప్రకారం ప్రతి 10 మంది యువతీయువకుల్లో 8 మంది తల్లితండ్రులకు సమ్మతం లేని కులాంతర వివాహాలకు సై అంటున్నారట. గత నెలలో నిర్వహించిన ఈ సర్వేలో కోటికి పైగా నెటిజన్స్ పాల్గొని తమ అభిప్రాయానికే తప్ప మరి దేనికీ ప్రాధాన్యం ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు. పెళ్లి కాగానే భార్య ఇంటిపేరు మార్చుకోవడం మన సంప్రదాయం. అయితే అది ఒక ఇగో విషయంగా కనిపించడం వల్లో ఏమో అమ్మాయిలు పెళ్లయినా భర్త ఇంటిపేరు తీసుకోం అని అంటున్నారు. చిత్రం ఏమంటే – కుర్రాళ్లలో 75 శాతం మంది తమకు తమ భార్యలు ఇంటి పేరు మార్చుకోకపోయినా ఏమీ అభ్యంతరం లేదన్నారు. అలాగే, అమ్మాయిలు కూడా అబ్బాయిలకు మరో ఆఫర్ ఇచ్చారు. భర్త తమకంటే తక్కువ సంపాదించేవాడైనా ఓకేనట. యువతరంలో అందరూ విశాల హృదయులుగా మారుతున్నారని సంతోషించాలా? లేక మన సంప్రదాయాలకి కాలం చెల్లుతోందని సంతాపం వెలిబుచ్చాలా? ఏమో… కాలమే చెప్పాలి.

This post is also available in: enఇంగ్లిష్‌


PremaLekhalu