లేడి డిటెక్టివ్ గా త్రిష

సీనియర్ హీరోయిన్ త్రిష ఈ మధ్య వరసగా లేడి ఓరియెంటెడ్ సినిమాల మీదే దృష్టి పెట్టారు. తాజాగా తమిళంలో ‘మోహిని’ అనే సినిమా చేసిన ఈమె ప్రస్తుతం ఇంకో లేడి ఓరియెంటెడ్ ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. డిటెక్టివ్ థ్రిల్లర్ కథాంశంతో రూపుదిద్దుకునే ఈ చిత్రానికి ‘కుట్ట్రప్పయిర్చి’ అనే టైటిల్ ని ఖరారు చేసింది చిత్ర యూనిట్. ఈ చిత్రంలో త్రిష ఇండియాస్ ఫస్ట్ విమెన్ డిటెక్టివ్ రజనీ పండిట్ రోల్ చేయనుంది. అంతేకాదు ఈ చిత్రంలో మరో నటి ప్రియమణి కూడా నటిస్తారని తెలుస్తోంది.
ఇకపోతే ఈ చిత్రాన్ని డెబ్యు డైరెక్టర్ వెర్నిక్ దర్శకత్వం వహిస్తుండగా జి.వివేకానందన్ నిర్మిస్తున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ రధన్ ఈ చిత్రానికి బాణీలు అందిస్తుండగా దీనిపై పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడవనున్నాయి.

This post is also available in: enఇంగ్లిష్‌