లవర్ తెలుగు మూవీ రివ్యూ

PremaLekhalu

#Lover
చిత్రం : లవర్
విడుదల తేది : జూలై 20, 2018
తెలుగువాడు. కామ్ రేటింగ్ : 6/10
రైటర్ & డైరెక్టర్ : అనీష్ కృష్ణ
నిర్మాత : హర్షిత్ రెడ్డి
సమర్పణ : దిల్ రాజు
మ్యూజిక్ : అంకిత్ తివారి
నటీనటులు : రాజ్ తరుణ్, రిద్ది కుమార్, అజయ్, రాజీవ్ కనకాల తదితరులు
పరిచయం :
#Lover
రాజ్ తరుణ్, రిద్ది కుమార్ జంటగా ‘అలా ఎలా’ ఫేం అనీష్ కృష్ణ దర్శకత్వం లో తెరకెక్కిన సినిమా ‘లవర్’. దిల్ రాజు సమర్పణలో హర్షిత్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మధ్యకాలంలో సరైన హిట్ లేక సతమతవుతున్న రాజ్ తరుణ్ ఈ సినిమాతో అయినా హిట్ కొడతాడా లేదా అనేది చూద్దాం.
కథ :-
రాజ్ (రాజ్ తరుణ్) ఒక బైక్ మెకానిక్, తన స్నేహితులతో కలిసి ఒక గ్యారేజ్ నడుపుతూ టెక్నాలజీ సహాయంతో కొత్త కొత్త బైక్స్ రూపొందిస్తాడు. బైక్స్ అమ్మిన డబ్బుతో బ్యాంకాక్ వెళ్ళాలనుకున్న రాజ్ అనుకోని విధంగా గొడవ జరిగి హాస్పిటల్ లో చేరతాడు. ఆ సమయంలో అదే హాస్పిటల్ లో నర్స్ గా పనిచేస్తున్న చరిత(రిద్ది కుమార్)ని చూసిన రాజ్ మొదటి చూపులోనే ప్రేమలో పడతాడు. మొదట్లో ఆమె రాజ్ ని ఇష్టపడదు, కానీ రాజ్ చేసిన ఒక మంచి పని వల్ల అతని మీద ఇష్టం పెరుగుతుంది. ఇది ఇలా ఉండగా ఒక గ్యాంగ్ చరిత మీద ఎటాక్ చేస్తుంది.
అసలు ఆ గ్యాంగ్ ఎవరూ..? ఆ గ్యాంగ్ ఎందుకు చరిత ని చంపాలనుకుంది.? రాజ్ తన ప్రేయసి ని ఎలా కాపాడుకున్నాడు అన్నది తెర మీద చూడండి.

ప్లస్ పాయింట్స్ :
హీరో రాజ్ తరుణ్ కొత్త మేక్ ఓవర్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. హీరోయిన్ రిద్ది కుమార్ కూడా మలయాళీ అమ్మాయి పాత్రలో చక్కగా నటించింది. ఇద్దరి మధ్య ఫస్ట్ హాఫ్ లో వచ్చిన సీన్స్ బాగానే ఆకట్టుకుంటాయి. ప్రధమార్ధంలో అక్కడక్కడా వచ్చే కొన్ని కామెడీ సీన్స్ బాగున్నాయి. రాజీవ్ కనకాల సీరియస్ రోల్ లో రాజ్ అన్నగా తన పాత్ర పరిధి మేరకు నటించాడు. ఇకపోతే మిగిలిన నటీనటులు తమ పాత్రలకు న్యాయం చేశారు.
బ్యాక్ గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్ ఓకే. సినిమాలో విజువల్స్ చాలా బాగున్నాయి, సెకండ్ హాఫ్ లో వచ్చే కేరళ సన్నివేశాలలో విజువల్స్ మరింత అందంగా ఉన్నాయి అని చెప్పాలి.
మైనస్ పాయింట్స్ :-
మొదటి భాగం సరదాగా సాగినా రెండో భాగానికి వచ్చేసరికి సినిమా పూర్తిగా తేలిపోతుంది. అంతేకాదు ఎందరో మంచి నటులు ఉన్నా వాళ్ళని సరిగ్గా ఉపయోగించుకోలేదు దర్శకుడు. ఇంకా చెప్పాలంటే సచిన్ ఖేడ్కర్ వంటి మంచి నటుడుకు ఇందులో అసలు ప్రాధాన్యమే లేదు. రాజీవ్ కనకాల క్యారెక్టర్ ని బాగా ఎమోషనల్ గా చూపించినా చివరికి ఆ క్యారెక్టర్ ఎండ్ ప్రేక్షకులను అసంతృప్తి కలిగిస్తుంది. ఇంటర్వెల్, క్లైమాక్స్ సీన్స్ మాత్రం దర్శకుడు చాలా సింపుల్ గా తేల్చేశాడు.

టెక్నికల్ సంగతులు :

హర్షిత్ రెడ్డి నిర్మాణ విలువలు బాగున్నాయి. ఎడిటింగ్ ఓకే. ఫోటోగ్రాఫీ బాగుంది. అందమైన లొకేషన్స్ లో చిత్రీకరించిన పాటల విజువల్స్ బాగున్నాయి. ఐదుగురు సంగీత దర్శకులు పనిచేసిన ఈ చిత్రానికి పాటలే హైలైట్ గా నిలుస్తాయి. కేరళ లొకేషన్స్ అందంగా చూపించారు. జె.బి అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది.
డైరెక్టర్ అనీష్ కృష్ణ తను రాసుకున్న కథను స్క్రీన్ మీద చూపించడంలో విఫలం అయ్యాడనే చెప్పాలి. మొదటి భాగం సరదాగా సాగింది కానీ సెకండ్ హాఫ్ మాత్రం కొన్ని చోట్ల బోర్ కొట్టిస్తుంది. ఆయన మరింత శ్రద్ధ పెట్టి ఉంటే బాగుండేది. ఏది ఏమైనా సెకండ్ హాఫ్, ఇంటర్వెల్, క్లైమాక్స్ సీన్స్ వల్ల ఈ సినిమా ఏవరేజ్ అనే చెప్పాలి.

వెర్డిక్ట్ :- లవర్ – ఏవరేజ్ లవ్ స్టొరీ.
రేటింగ్ : 6/10

This post is also available in: enఇంగ్లిష్‌


PremaLekhalu