రామ్‌చరణ్‌… ఎన్టీఆర్‌… ఇద్దరివీ రాంగ్‌ స్పెల్లింగ్‌లే!

F2 Movie
Ramcharan .. NTR .. Both Having Wrong Spellings!

అదేంటి? రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌ పేర్లలో స్పెల్లింగ్‌ మిస్టేక్స్‌ ఏం ఉన్నాయి? పైగా ఇద్దరూ రామ్‌ చరణ్‌, రామారావ్‌ అంటూ రాజమౌళితో కలిసి ఆర్‌ఆర్‌ఆర్‌గా ఒకటే స్పెల్లింగ్‌ గా మారిపోయారు కూడానూ… అనుకుంటున్నారా? ఇక్కడ చెప్పేది వాళ్ల పేర్ల స్పెల్లింగుల గురించి కాదు. వాళ్ల పేరుతో సెల్‌ ఫోన్లని సెల్‌ చేస్తున్న షాపుల స్పెల్లింగుల గురించి! ప్రస్తుతం జూనియర్‌ ఎన్టీఆర్‌ సెల్‌ఫోన్లమ్మే సెలక్ట్‌ అనే కంపెనీకి బ్రాండ్‌ అంబాసిడర్‌ గా ఉన్నాడు. ఇంతకు ముందే రామ్‌ చరణ్‌ కూడా హ్యాపీ అనే సెల్‌ఫోన్‌ సెల్లింగ్‌ కంపెనీ తరఫున ప్రకటనల్లో కనిపించాడు. అయితే ఈ రెండు కంపెనీల పేర్లూ కూడా రాంగ్‌ స్పెల్లింగుల్నే కలిగి ఉన్నాయి. అఫ్‌కోర్స్‌… జనాన్ని ఈజీగా ఆకట్టుకోవడం కోసమే ఇవి ఒరిజినల్‌ పేర్లని కాస్త మార్చాయని వేరే చెప్పక్కర్లేదనుకోండి! హ్యాపీ కంపెనీ స్పెల్లింగ్‌ HAPPY అని కాకుండా HAPPI అని రాస్తున్నారు. సెలక్ట్‌ కంపెనీ స్పెల్లింగ్‌ SELECT అని కాకుండా CELEKT అని రాస్తున్నారు. అయినా ప్రైస్‌ ల్లోనూ డిస్కౌంటుల్లోనూ ప్రత్యేకత ఉండాలిగానీ… స్పెల్లింగ్‌దేముంది?

This post is also available in: enఇంగ్లిష్‌


PremaLekhalu