రాజమౌళి చిత్రంలో జాన్వీ కపూర్

F2 Movie

దివంగత హీరోయిన్ శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ రీసెంట్ గా ‘దఢక్’ సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని కూడా అందుకుంది. జాన్వీ నటనకు విమర్శకుల దగ్గర నుండి కూడా మంచి మార్కులు పడ్డాయి. ఇది ఇలా ఉంటే రాజమౌళి లో దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలు గా రూపొందనున్న మల్టీ స్టారర్ లో జాన్వీ కపూర్ ని ఒక హీరోయిన్ గా ఎంపిక చేద్దాం అనుకుంటోంది చిత్ర యూనిట్. ఈ సినిమాని డి.వి.వి.దానయ్య యూనివర్సల్ మీడియా బ్యానర్ మీద నిర్మిస్తున్నారు.

రాజమౌళి, దానయ్య ఇప్పటికే ముంబై వెళ్లి జాన్వీ కి కథ వినిపించాలని చూస్తున్నారని టాక్ నడుస్తోంది. ఈ రూమర్ లో ఎంత వరకు నిజం ఉందొ లేదో తెలియాలంటే ఇంకా కొద్ది రోజులు ఆగాల్సిందే. ఏది ఏమైనా ఈ వార్త నిజమైతే జాన్వీ కపూర్ టాలీవుడ్ అరంగ్రేటం ఖాయం అయినట్లే..!


PremaLekhalu