మీడియాని బతిమాలుకుంటున్న సింగర్

Singer Demi Lovato is diagnosed to have Bipolar Disorder. Now she requests media not to stamp her on that name.

మీడియా తలుచుకుంటే ఏమైనా చేయగలదు. ఎవరిమీదైనా ఎలాంటి ముద్రయినా వేయగలదు. మంచి ఎంత వరకు చేస్తుందో తెలీదు కానీ, పలానా వాళ్లు ఇలాంటి వాళ్లు అని వ్యక్తి పరమైన ముద్ర వేయాలంటే మాత్రం – మీడియాకి అది పెద్ద పనేం కాదు. కమ్యూనిస్ట్ లీడర్ అయిన నారాయణ ఆ మధ్య ఒక్కరోజు ఏదో చికిన్ తిన్నాడని దాన్నే పదేపదే ప్రసారం చేయడం వల్ల ఏమయింది? నారాయణని చూడగానే ఇప్పుడు చికినే గర్తుకొచ్చే పరిస్థితి ఏర్పడింది. అలాగే డ్రగ్స్ కేసులో టాలివుడ్ నటులను విచారించడం మొదలు పెట్టి దానికి మితిమీరి ప్రాధాన్యం ఇవ్వడం వల్ల ఇప్పుడు భవిష్యత్తులో చార్మిని చూసినా, రవితేజని చూసినా – ముందు మనకి డ్రగ్సే గుర్తొచ్చే అవకాశం ఉంది. అయితే మీడియా మనకి మాత్రమే ఇలా ఉందా? అంటే – కాదు. ఫారిన్ లో కూడా పరిస్థితి దాదాపు ఇలాగే ఉంది. ఉదాహరణకి డెమీ లొవేటో అనే అమెరికన్ సింగర్ ఉంది. ఈమె సాంగ్ రైటర్ , నటి కూడా . ఈ మధ్య ఈమె హెల్త్ చెక్ చేయించుకున్నప్పుడు డాక్టర్లు ఆమెకి బైపోలార్ డిజార్డర్ ఉంది అని చెప్పారు.

బైపోలార్ డిజార్డర్ అంటే – మానసిక నిరాశతో కూడిన అనారోగ్యం – అంటే ఒక డిప్రెషన్ లాంటిది. ఇలాంటి డిజార్డర్ ఉన్నవాళ్లు ఒక్కొక్కసారి ఉత్సాహంతో పొంగిపోతుంటారు,ఒక్కొక్కసారి నిరాశతో కుంగిపోతుంటారు. ఇలా పొంగిపోడాన్ని మేనిక్ ఎపిసోడ్ అంటారు, కుంగిపోడాన్ని డిప్రెస్సివ్ ఎపిసోడ్ అంటారు. పొంగిపోయే మేనిక్ ఎపిసోడ్ లో ఉన్న టైమ్‌లో – వీళ్లు చాలా ఎక్కువ శక్తి ఉన్నట్టు ఫీల్ అవుతుంటారు. మామూలుగా కంటే చాలా యాక్టివ్ గా ప్రవర్తిస్తుంటారు. విపరీతమైన ఆలోచనలు వస్తున్నట్టు ఫీలైపోతుంటారు. ఏదైనా చేసేయగలం అనే అతివిశ్వాసం ప్రదర్శిస్తుంటారు. రిస్కుతో కూడుకున్న పనులు చేస్తారు. అతిగా శృంగారంలో పాల్గోనాలని కూడా అనుకుంటారు. అలాగే డబ్బుఖర్చు చేయడంలో కూడా ఏవిధమైన లెక్కచేయకుండా విపరీతంగా ఖర్చుపెట్టేస్తూ ఉంటారు. మళ్ళీ మూడ్ ఆఫ్ లో ఉన్నప్పుడు అంటే డిప్రెస్సివ్ ఎపిసోడ్ లో ఉన్నప్పుడు,చాలా విచారంగా ,అంతా కోల్సోయినట్టు ఫీలవుతుంటారు. చాలా వర్రీ అవుతుంటారు. తమకు ఎవరూ లేనట్టు నిరాశగా ఫీల్ అవుతుంటారు. తింటే విపరీతంగా తింటారు. లేకపోతే మొత్తం మానేస్తారు. . ఇలా ఈ డిప్రెస్సివ్ ఎపిసోడ్ లో మరొక విధమైన ఎక్స్ ట్రీమ్ ఉంటుంది.

నిజానికి బైపోలార్‌ డిజార్డర్‌ అనేది ఇది మరీ అంత ప్రమాదకరమైంది కాదు కానీ డెమీలొవాటోకి ఎప్పుడైతే డాక్టర్లు ఈ లోపం ఉంది అని చెప్పారో- మొత్తం పత్రికలన్నీ ఇదే వార్తతో ఆడుకుని ఆడుకుని వదిలిపెట్టాయి. ఇప్పుడు ఆ అమ్మాయికి భయం పట్టుకుంది. ఈ మీడియా అతి ప్రకోపం వల్ల – జనం ఇక తనని చూడగానే ఆ బైపోలార్ డిజార్డర్ అనే రోగాన్నే గుర్తుచేసుకుంటారేమోనని! ఆ పేరునీ రోగాన్నీ తనపేరుతో నిత్యం లింక్‌ చేసి రాసేస్తుంటే – ఇక శాశ్వతంగా తన కెరీరే దెబ్బతినేస్తుందేమో అనేంత భయం కలిగి ఇప్పుడు ఆమె మీడియాని రిక్వెస్ట్ చేస్తోంది . “దయచేసి నా వ్యాధిని నాతో అసోసియేట్ చేయకండి, డెమీ లొవేటో అనగానే బైపోలార్ డిజార్డర్ అని రాసేయద్దు. బైపోలార్ డిజార్డర్‌ అనేది నాకున్న చిన్న అనారోగ్యం. అంతేగానీ నేనే బైపోలార్ డిజార్డర్‌నికాదు. మీరు నా ఐడెంటిటీ మొత్తాన్ని ఈ రోగంతో జతచేసి అనవసరంగా ప్రచారం చేయద్దు, నా కెరీర్‌ పాడుచేయద్దు అని కోరుకుంటున్నా! ” – అన్నది ఆమె రిక్వెస్ట్! నిజమే కదా? దీని బట్టి మనకు అర్థం అయింది ఏంటీ అంటే – ప్రపంచంలో ఎక్కడైనా మీడియా అనేది ఒక్కలాగే ప్రవర్తిస్తోందన్నమాట. ఏదైనా ఒక విషయం దొరికిందీ అంటే – దాని పట్ల జనానికి ఆసక్తి ఉంటుందీ అనుకుంటే – అవతలి వ్యక్తి జీవితం ఏమైపోయినాసరే – దానిలోంచి వచ్చే ఎంటర్ టైన్‌మెంట్ ని పిండుకోవడానికే మీడియా ప్రయత్నిస్తోంది. ఇది భారతదేశంలోనే కాదు అమెరికాలో కూడా అక్షర సత్యమే అన్నమాట!

డెమీ లొవాటోని యాక్షన్లో చూడాలంటే ఈ “తెలుగువాడు యానిమేషన్‌” ని క్లిక్‌ చేయండి  !

Singer Demi Lovato is diagnosed to have Bipolar Disorder. Now she requests media not to stamp her on that name.

మరిన్ని డెమీ లొవాటో వీడియో షాట్స్‌ చూడాలనుకుంటున్నారా?

అయితే ఇక్కడ క్లిక్‌ చేయండి :

Singer Begging Media Not To Stamp Her “BiPolar”

This post is also available in: enఇంగ్లిష్‌


Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*