మహేష్ తో నటించనున్న డీజే భామ

F2 Movie

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్ లో ‘భరత్ అను నేను’ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ ఇప్పుడు చివరి దశలో ఉంది. ఈ సినిమా తర్వాత మహేష్ బాబు వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో ఒక చిత్రం చేయనున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం ప్రీ- ప్రొడక్షన్ వర్క్ మొదలు కాగా హీరోయిన్ పాత్ర కోసం పూజా హెగ్డే ని ఎంపిక చేసింది చిత్ర యూనిట్. హీరోయిన్ పూజా హెగ్డే ఈ విషయాన్ని తన ట్విట్టర్ ద్వారా అధికారకంగా అనౌన్స్ చేసింది.
ఈ చిత్రం సమ్మర్ లో సెట్స్ మీదకు వెళ్ళనుంది. హీరో మహేష్ బాబు ‘భరత్ అను నేను’ షూటింగ్ పూర్తికాగానే ఈ చిత్ర షూటింగ్ లో పాల్గొనున్నారు. ఈ సినిమాపై పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు. ఈ చిత్రాన్ని దిల్ రాజు, అశ్వినీదత్ సంయుక్తంగా నిర్మిస్తారని తెలుస్తోంది.

This post is also available in: enఇంగ్లిష్‌


PremaLekhalu