భారతదేశంలో మహిళలకు భద్రత లోపించిందా..!

F2 Movie

మంగళవారం లండన్ లో నిర్వహించిన ప్రపంచ నిపుణుల సర్వే ప్రకారం భారతదేశం మహిళలకు అత్యంత ప్రమాదకరమైన దేశంగా అభివర్ణించారు. థామ్సన్ రాయిటర్స్ ఫౌండేషన్లో మహిళల సమస్యలపై సుమారు 550 మంది నిపుణులు ఈ సర్వేలో పాల్గొని పరిశీలిస్తే భారతదేశం మొదటి స్థానంలో ఉండగా తరువాత సోమాలియా, సౌదీ అరేబియాలు ఉన్నాయి.

లైంగిక దాడులు, అత్యాచారాలు, విమెన్ ట్రాఫ్ఫికింగ్ తదితర అంశాలు దృష్టిలోకి తీసుకుని భారతదేశం మహిళలకు అత్యంత ప్రమాదకరం అని తేల్చి చెప్పారట.

ముఖ్యంగా వాళ్ళు చెప్పిన అంశాలు జరుగుతున్న మాట వాస్తవమే.. కానీ మన దేశం వదిలి వెళ్ళిన ఆ తెల్ల దొరలు మన దేశం ఇలా ఉంది అనడం మనకే సిగ్గు చేటు. దీనికి అంతటికి కారణం మన నాయకులు, వాళ్ళు పాలిస్తున్న తీరు మాత్రమే..

మన జాతిపిత గాంధీ అప్పుడు ఒక మాట అన్నారు ఆడది ఎప్పుడైతే అర్ధరాత్రి రోడ్ మీద తిరుగుతుందో అప్పుడే స్వాతంత్రం వచ్చింది అని కానీ ఇప్పటికీ కూడా ఆడవాళ్లు రాత్రులే కాదు పగలు కూడా ఒంటరిగా వెళ్ళలేకపోతున్నారు.. ఎక్కడ చూసిన ఆడవాళ్ళ మీద అఘాయిత్యాలు, అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. మన సొంత మనుషులు చేస్తున్నారు కూడా.

వీటికి ముఖ్య కారణం రాజకీయ నాయకులు, మన చట్టాలు, సినిమాలు, మరియు సోషల్ మీడియా.. ఈకాలంలో సోషల్ మీడియా, సినిమాలు ప్రజల మీద చాలా ప్రభావం చూపుతున్నాయి. మంచి కన్నా చెడు ఎక్కువగా పాకుతోంది. సినిమాల్లో నీటి కన్నా శృంగారం ఎక్కువ ఉంటోంది. అన్ని సినిమాలు అలా ఉంటున్నాయి అని చెప్పట్లేదు.. కానీ సుమారు 90% సినిమాలలో శృంగారం మాత్రమే ఉంది. ఇకపోతే మన చట్టాలు… అవి కఠినంగా ఉన్నా డబ్బు ఉన్నవాడికి, డబ్బు లేనివాడికి వివిధ రకాలు గా ఉంటాయి. అంతేకాదు మన భారతదేశంలో మాత్రమే డబ్బు ఉన్నవాడు.. ఇంకా కోట్లు సంపాదిస్తాడు… మధ్యతరగతి వాడు క్షీణిస్తూనే ఉంటాడు.

ఇలాంటివన్ని మారి సరైన నాయకుడు వస్తే తప్పక మన దేశంలోని స్త్రీలు ఆనందంగా ఉంటారు.


PremaLekhalu