బెన్నీ ఉంటే.. భాషలు నేర్చుకునే భయం పోయినట్టే!

PremaLekhalu

భాషలు నేర్చుకోవడానికి ఎన్నో మార్గాలు! అయితే కాన్ఫిడెంట్‍ గా కొత్త భాషని మాట్లాడగలిగేలా చేసే టూల్స్‌ మాత్రం చాలా తక్కువగానే ఉన్నాయి. భాష

నేర్చేసుకోవాలని తపన ఉన్నా – సరయిన టూల్‍, సిస్టమ్‍ దొరక్కపోతే – సమయం వృథా అవడమే కాదు, ఉన్న ఆసక్తి కూడా పోతుంది.

ముఖ్యంగా ఫారిన్‍ భాషల విషయంలో – అక్షరాలూ అర్థాలూ కాస్త నేర్చుకున్నా – మాట్లాడడానికి వచ్చేసరికి బెరుకూ భయం కలుగుతాయి. ఏం అనబోయి ఏం అంటామో అనే సందేహంతో – అసలు నోరే పెగలదు. కొన్ని ఫారిన్‍ భాషల ఉచ్చారణ మనకి చాలా కష్టంగా అనిపిస్తుంది. రాసే అక్షరానికీ పలికే శబ్దానికీ పొంతన ఉండని ఫ్రెంచ్‍ లాంటి భాషలు నేర్చుకునేటప్పుడయితే – సరయిన గైడ్‍ లేకుండా భాషని ఎంతమాత్రం నేర్చుకోలేం.

అయితే ఇలాంటి వారికి ఐర్లాండ్‌కి చెందిన బెన్నీ లూయీస్‍ – ఆన్‌లైన్‌లో ఓ మంచి మార్గం చూపిస్తున్నాడు. ఫ్లూయెంట్‌ ఇన్‌ త్రీ మంత్స్‌ (fluentin3months.com) అంటూ … కేవలం మూడే మూడు నెలల్లో ఏ కొత్త భాషనైనా మీరు తడుముకోకుండా మాట్లాడాలంటే – ఇదిగో ఇదే బెస్ట్‌ మార్గమని కొన్ని పాయింట్లు సూచిస్తున్నాడు. ఇవి నిజంగా ఎంతో ప్రయోజనకరంగా ఉన్నాయి.

స్వయంగా ఏడు భాషల్ని అలవోకగా మాట్లాడగల బెన్నీ … ఆ భాషలన్నిటినీ తనే సొంతంగా నేర్చుకున్నాడు. తన అనుభవాల్లోంచి వచ్చిన కిటుకుల్ని క్రోడీకరించి – దాన్నే ఒక కోర్సుగా మార్చి జనానికి అంగీకరిస్తున్నాడు.
భాషలు నేర్చుకునేందుకు రోసెటా స్టోన్‌, పిమ్‌స్లియర్‌ సిస్టమ్‌ లాంటివెన్నో ఇప్పటికే ఎన్నో ప్రచారంలో ఉన్నాయి. ఇంటర్‌ నెట్‌ వచ్చాక ఇవన్నీ జనానికి దగ్గరయ్యాయి. వీటికి తోడు డ్యుయోలింగో, ఫిఫ్టీ లాంగ్వేజెస్‌ లాంటి యాప్స్‌ కూడా వందలకొద్దీ లభిస్తున్నాయి. అయితే అనుభవంతో లాంగ్వేజెస్‌ నేర్పుతున్న బెన్నీ లూయీస్‌ సిస్టమ్‌ కి దాని ప్రత్యేకత దానికి ఉంది. మనం నేర్చుకున్న కొత్త భాషని మాట్లాడగలిగే సామర్థ్యం మనకి ఉంది – మాట్లాడదాం – అనే కాన్ఫిడెన్స్‌ ని ఇవ్వడంలో బెన్నీ లూయీస్‌ ముందుంటున్నాడు. థాంక్యూ బెన్నీ!

This post is also available in: enఇంగ్లిష్‌


PremaLekhalu