బిచ్చగాడు పాత్రలో ‘చిరంజీవి’?

F2 Movie

చిరంజీవి అప్పుడెప్పుడో ‘శుభలేఖ’లో హొటల్‌ బాయ్‌గా, ‘స్వయంకృషి’లో చెప్పులుకుట్టేవాడిగా నటించాడు. మెగాస్టార్‌ గా మారి, హీరోయిజానికి దగ్గరై, సహజమైన పాత్రలకి దూరమైపోయి చాలాకాలమయింది. మరిప్పుడు కొత్తగా ఈ ‘బిచ్చగాడు’ పాత్రేంటి? – అనుకుంటున్నారా? మేం చెప్పేది మీరనుకునే మెగాస్టార్‌ చిరంజీవి గురించి కాదు. అర్జున్ మేనల్లుడు చిరంజీవి సర్జా గురించి! తల్లి కోసం ‘బిచ్చగాడు’గా మారి తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించిన విజయ్ ఆంటోనీ పాత్రను చిరంజీవి సర్జా కన్నడ తెరమీద పోషించాడు.

ఈ సినిమాకి ‘అమ్మా ఐ లవ్ యు’ అనే టైటిల్‌ పెట్టారు. దర్శకుడు చైతన్య . శాండల్‌వుడ్ ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ ‘ద్వారకేశ్’ బ్యానర్‌లో 51వ చిత్రంగా ఈ ‘అమ్మా ఐ లవ్ యు’ తెరకెక్కింది.
ఈ సినిమాలో చిరంజీవి సర్జా పక్కన కొత్త హీరోయిన్ నిశ్వికా నాయుడు నటించారు. హీరో తల్లి పాత్రలో ప్రముఖ నటి సితార కనిపించారు. ఈ సినిమాని బెంగళూరు, ఉడిపి పరిసరాల్లో తీశారు. బిచ్చగాడు సినిమా తమిళంలో పిచ్చైక్కారన్ పేరిట మంచి హిట్‌ కొట్టిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు కన్నడలో ఈ సినిమా జనాదరణ పొందింది.

This post is also available in: enఇంగ్లిష్‌


PremaLekhalu