‘బిచ్చగాడు’ … ఇప్పుడు ఓ సక్సెస్ సెంటిమెంట్!

PremaLekhalu

ఒక సినిమాకి ‘బిచ్చగాడు’ పేరు పెడితే నిర్మాత బిచ్చగాడైపోతాడేమో అని సెంటిమెంటల్‌ గా భయపడ్డ రోజులున్నాయి. విజయ్‌ ఆంథోనీ తమిళంలో ‘పిచ్చైక్కారన్‌’ సినిమా తీసినప్పుడు టైటిల్‌ విషయంలో ఇదే చర్చ జరిగింది. మొత్తానికి విజయ్‌ పట్టుబట్టడం వల్ల అందరూ ఒప్పుకోవడం, సినిమా సూపర్‌ హిట్‌ కావడం జరిగింది. తరవాత మళ్లీ తెలుగులోనూ అదే పరిస్థితి. ‘బిచ్చగాడు’ అని టైటిల్‌ పెట్టినా, ఆ అక్షరాలకి కాస్త బంగారంతో అలంకరణ చేశాకే – సినిమా రిలీజ్‌ చేయడానికి ఒప్పుకున్నాడని అన్నారు. మరి ఇప్పుడు బిచ్చగాడు అన్నదే ఓ సక్సెస్‌ పదంలా అయిపోయినట్టుంది. ఇప్పుడు ‘బిచ్చగాడా మజాకా’ అని ఓ సినిమా వచ్చేస్తోంది.

ఎస్.ఏ.రెహమాన్ సమర్పణలో ఆల్ వెరైటీ మూవీ మేకర్స్ పతాకంపై ప్రముఖ దర్శకులు కె.ఎస్.నాగేశ్వరావు దర్శకత్వంలో బి.చంద్రశేఖర్ (పెదబాబు) నిర్మిస్తున్నవినూత్న కథాచిత్రం ‘బిచ్చగాడా మజాకా’. ఏ బ్రేకప్ లవ్ స్టోరీ’ అన్నది ట్యాగ్ లైన్. అర్జున్ రెడ్డి, నేహాదేశ్ పాండే హీరోహీరోయిన్స్ గా నటించిన ఈ చిత్రంలో బాబూమోహన్, సుమన్, ధన్ రాజ్, చిత్రం శ్రీను, అపూర్వ, బాలాజీ, డి.ఎస్.రావు, తుమ్మల రామసత్యనారాయణ ముఖ్య పాత్రలు పోషించారు. శ్రీవెంకట్ సంగీత సారధ్యం వహించిన ఈ చిత్రం ఆడియో హైద్రాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ ప్రివ్యూ ధియేటర్ లో ఘనంగా జరిగిన కార్యక్రమంలో విడుదలైంది. సుప్రసిద్ధ ఆడియో కంపెనీ ఆదిత్య మ్యూజిక్ ద్వారా పాటలు ఆన్ లైన్ లో లభ్యం కానున్నాయి.

ఈ చిత్రంలో ముఖ్య పాత్ర పోషించడంతోపాటు, ఈ చిత్రంలో టైటిల్ సాంగ్ ఆలపించిన ప్రముఖ నటుడు, శాసన సభ్యులు బాబు మోహన్ ఈ చిత్రం ఆడియోను ఆవిష్కరించారు. దీనికి ముందు చిత్రంలోని నాలుగు పాటలు, ట్రైలర్ విడుదల చేసి ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో చిత్ర సమర్పకులు ఎస్.ఏ.రెహమాన్, నిర్మాత బి.చంద్రశేఖర్ (పెదబాబు), హీరో అర్జున్ రెడ్డి, హీరోయిన్ నేహా దేశ్ పాండే, నటుడు బాలాజీ, డి.ఎస్.రావు, సంగీత దర్శకుడు శ్రీ వెంకట్, కెమెరామెన్ అడుసుమిల్లి విజయ కుమార్, డాన్స్ మాస్టర్ విఘ్నేష్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఎస్.ఎం.భాషా, లైన్ ప్రొడ్యూసర్ తేజా రెడ్డి, ఆదిత్య ప్రతినిధి మాధవరావు, పబ్లిసిటీ డిజైనర్ సుజీత్ తదితరులు పాల్గొన్నారు.
బాబు మోహన్ మాట్లాడుతూ.. ‘ప్రొడ్యూసర్ చంద్రశేఖర్ అన్నీ తానే అయి.. డైరెక్టర్ కె.ఎస్.నాగేశ్వరావు నుంచి చాలా మంచి అవుట్ ఫుట్ తీసుకున్నారు. భవిష్యత్ లో చాలా పెద్ద నిర్మాత అవుతాడు. శ్రీ వెంకట్ మ్యూజిక్ చాలా బావుంది. వినూత్నమైన కథాంశంతో రూపొందిన ‘బిచ్చగాడా మజాకా’ మంచి హిట్ అవుతుంది’ అన్నారు.

ఈ చిత్రానికి కథ, మాటలు, పాటలు సమకూర్చిన నిర్మాత బి.చంద్రశేఖర్ (పెదబాబు) మాట్లాడుతూ.. ‘బిచ్చగాడి మజాకా’ రొటీన్ స్టోరీ కాదు.. బిచ్చగాళ్ళు లేని సొసైటీ కోసం ఒక యువకుడు చేసిన పోరాటం ఏవిధమైన మలుపులు తిరిగింది. అది అతని ప్రేమకథను ఏ విధంగా ప్రభావితం చేసింది అనే కథాంశంతో రూపొందించాం” అన్నారు.

చిత్ర దర్శకుడు కె.ఎస్.నాగేశ్వరావు మాట్లాడుతూ.. ‘చిన్న సినిమాగా త్వరలో విడుదల కానున్న’బిచ్చగాడా మజాకా’ విడుదలయ్యాక చాలా పెద్ద సినిమా అవుతుంది. బాబూమోహన్ గారి సహాయ సహకారాలు మరువలేనివి. ఆగస్టులో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’ అన్నారు. ఈ చిత్రం తమ కెరీర్స్ కి టర్నింగ్ పాయింట్ గా నిలుస్తుందని హీరో అర్జున్ రెడ్డి, హీరోయిన్ నేహా దేశ్ పాండే అన్నారు. దర్శకుడు కె.ఎస్.నాగేశ్వరావు, నిర్మాత చంద్రశేఖర్ ల ప్రోత్సాహంతో మంచి సంగీతం అందించానని సంగీత దర్శకుడు శ్రీ వెంకట్ అన్నారు.
రాజశ్రీ నాయర్, కె.ఎస్.రాజు, గౌతమ్ రాజు, చిట్టిబాబు, తిలక్, శ్రీధర్ రానా ఇతర ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి ఎడిటింగ్: మార్తాండ్ కె.వెంకటేష్, కో-డైరెక్టర్: రమేష్ రెడ్డి, అసోసియేట్ డైరెక్టర్: వి.పురుషోత్తం రెడ్డి, కథ-స్క్రీన్ ప్లే-మాటలు-పాటలు-నిర్మాత: బి.చంద్రశేఖర్ (పెదబాబు), స్క్రీన్ ప్లే-దర్శకత్వం: కె.ఎస్.నాగేశ్వరావు!!

This post is also available in: enఇంగ్లిష్‌


PremaLekhalu