బాలయ్య హీరోయిన్ తో నిహారిక చిత్రం..!

PremaLekhalu

సీనియర్ హీరోయిన్ శ్రియ తన పెళ్లి తర్వాత ఒక కొత్త చిత్రానికి సైన్ చేసింది. లేడి ఓరియెంటెడ్ సబ్జెక్టు తో రూపుదిద్దుకునే ఈ చిత్రం లాంచ్ అయింది. ఈ చిత్రానికి వరుణ్ తేజ్, క్రిష్ జాగర్లమూడి హాజరు కాగా క్రిష్ మొదటి షాట్ ను డైరెక్ట్ చేశారు. ఈ చిత్రంలో వరుణ్ తేజ్ సోదరి, హీరోయిన్ నిహారిక కూడ నటించనుంది.

నూతన దర్శకురాలు సుజనా ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయనుండగా ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. క్రియ ఫిల్మ్ కార్పొరేషన్, కాళి ప్రొడక్షన్స్ బ్యానర్లపై రమేష్ కరుటూరితో కలిసి జ్ఞానశేఖర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడించనుంది చిత్ర యూనిట్.


PremaLekhalu