పోర్న్‌స్టార్‌ రక్షాహోమం చేద్దాం రండి!

F2 Movie

నిన్నమొన్నటి వరకూ సన్నీ లియోన్ పేరు వింటే తెగ ఊగిపోయారు జనం. ఇప్పుడు వర్మ కొత్తగా పోర్న్ స్టార్ తో సినిమా తీస్తా అంటూ మియా మల్కోవాని తీసుకొచ్చాడు. సంప్రదాయానికి ప్రాధాన్యం ఇచ్చే భారతదేశంలో పోర్న్ సంస్కృతికి ఛీకొట్టాల్సి ఉంది. అయితే అందుకు భిన్నంగా పోర్న్‌ స్టార్స్‌కి ఇప్పుడు విపరీతంగా ఆదరణ లభిస్తోంది. ఏనాటినుంచో సంప్రదాయ వైఖరిలో నియమనిబంధనల మధ్య జీవితం కొనసాగిస్తూ ఉండడంవల్లో ఏమో.. ఒక్కసారిగా ఇంటర్నెట్ వచ్చేసరికి ఇండియన్స్ కి పోర్న్ మీద ఆసక్తీ ఆదరణా ఎక్కువయ్యాయి. అత్యంత హేయంగా, అశ్లీలంగా మనం భావించే పనులు చేసే వ్యక్తుల్ని – గొప్ప గొప్ప స్టార్స్ గా ఆరాధించే పరిస్థితి ఏర్పడింది. ఇది మనం సంస్కార పరంగా ఎదగడం అంటారా.. లేక వెనకబాటు అంటారా.. అన్నది చర్చించాల్సిన అంశం.

అయితే ఇక్కడ ఇండియాలో ఇలా పోర్న్ స్టార్స్ క్రేజ్ పెరుగుతుంటే, అవతల ఇదే ఇండస్ట్రీ లో అమెరికాలో వరసగా పోర్న్ స్టార్స్ చనిపోతున్నారు. అవును గత మూడు నెలల కాలంలో ఐదుగురు పోర్న్ స్టార్స్ అక్కడ మరణించారు. యుకె మిర్రర్‌ (UK Mirror) ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం – 31 ఏళ్ల వయసున్న యూరీ లవ్‌ (Yuri Luv) అనే పోర్న్ స్టార్ ఇటీవలే చనిపోయింది. ఎంతో పాపులర్ అయిన ఆగస్ట్‌ అమెస్‌ ( August Ames ) 23 ఏళ్లకే చనిపోయింది. ఇక ఒలీవియా నోవా ( Olivia Nova) అనే పోర్న్ స్టార్ 20 ఏళ్లకే చనిపోయింది. అలాగే ఎంతో క్రేజ్‌ కలిగిన 35 ఏళ్ల షైలా స్టైలజ్‌ ( Shyla Stylez ) కూడా ఈ మధ్య కాలంలోనే చనిపోయింది. ఇప్పుడు తాజాగా ఒలివియా లోవా ( Olivia Lua ) కూడా మరణించింది. ఈమెకి 23 ఏళ్లు. గత 3 నెలల కాలంలో చనిపోయిన పోర్న్‌ స్టార్స్‌లో ఈమె 5వది.

ఇప్పుడు మన ఇండియా విషయానికొద్దాం. మొన్నటివరకూ మన తెలుగు సినిమా ఇండస్ట్రీ లో హాస్య నటులందరూ చనిపోతుంటే “ఏంటబ్బా, తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఏం జరిగింది? ఏదో దోషం ఉండబట్టే ఒకే రంగానికి చెందిన ఇంతమంది ఒక్కొక్కరుగా చచ్చిపోతున్నారు, దీనికి శాంతి చేయాల్సిందే! ” అంటూ హోమాలూ గట్రా చేయించారు సినీ పెద్దలు. ఎందుకంటే మనం సంప్రదాయవాదులం. పాపం అక్కడ పోర్న్‌స్టార్స్‌ అంతమంది చచ్చిపోతున్నా – “అరెరె! ఒక్కసారిగా ఇంతమంది స్టార్స్ చనిపోవడం ఏమిటి? – అంటూ అక్కడ పోర్న్ ఇండస్ట్రీ ఉలిక్కిపడుతోందే తప్ప – హోమాలు చేయవచ్చన్న విషయం ఆ అమెరికావాళ్లకి తెలియదు. ఎందుకంటే వాళ్లు సంప్రదాయవాదులు కాదు కాబట్టి!

కానీ మనం భారతీయులం. చక్కని సంప్రదాయవాదులం. ఇప్పుడు పోర్న్‌ స్టార్స్‌ని కూడా సొంతం చేసుకుంటున్నాం. కానీ భారతీయ సంస్కృతిని ప్రేమిస్తామని గొప్పలు చెప్పుకుంటుంంటాం. కాబట్టి – మనమైనా పోర్న్ స్టార్స్ చనిపోకుండా హోమాలేమైనా చేయిస్తే మంచిదేమో, సంప్రదాయవాదులైన భారతీయులంతా ఈ విషయం గురించి సీరియస్‌గా ఆలోచిస్తే మంచిదని ‘తెలుగువాడి’ అభిప్రాయం. చూద్దాం. పోర్న్‌స్టార్స్‌ని మనకి పరిచయం చేయడానికి సంబరపడే మన తెలుగు సినీ పెద్దలు, హాస్యనటుల కోసం చేసినట్టుగానే – ఈ పోర్న్‌స్టార్‌ రక్షాహోమం కూడా చేయడానికి ముందుకొస్తారేమో!

This post is also available in: enఇంగ్లిష్‌


PremaLekhalu