పేరుకి 12 భాషల యాప్‌… ప్రమోట్ చేసేది మాత్రం హిందీ!

F2 Movie

జీ ఫైవ్ (Zee5) అనే యాప్ ఒకటి ఇప్పుడు ప్లేస్టోర్‌లో మనకి కనిపిస్తోంది. ఇది ఒక టీవీ యాప్. ‘ఇండియన్ టీవీ యాప్’ అని ఈ యాప్ ప్రచారం చేసుకుంటోంది. 90 లైవ్ ఛానెల్స్, 12 భాషల్లో కంటెంట్ ఇస్తామని పైకి గొప్పలు చెప్పుకుంటున్న ఈ యాప్ నిజానికి హిందీని మాత్రమే ప్రమోట్ చేస్తోంది. ఈ యాప్‌లో లాంగ్వేజ్ సెట్టింగ్స్‌లోకి వెళ్తే ఈ భాషా వివక్ష స్పష్టంగా తెలుస్తుంది.

Zee5 యాప్‌ లో Language అనే సెక్షన్‌లోకి వెళితే… Dislay, Content అని రెండు టాబ్స్ ఉంటాయి. Displayలో యాప్ ఏ భాషలో కనిపించాలనేది ఉంటుంది. హిందీ, ఇంగ్లీష్, మరాఠీ, తెలుగు ఇలా.. ఏదో ఒకదానిని ఎంచుకోవచ్చు. ఓకే. అయితే Content విషయానికి వెళ్ళే సరికి… హిందీ, ఇంగ్లీష్, మరాఠీ, తెలుగు వగైరా భాషల జాబితాలో… మరాఠీ, తెలుగు, కన్నడ, మలయాళం… ఇవన్నీ మనం ఆపు జెయ్యవచ్చు కానీ ఇంగ్లీష్, హిందీలను మనం ఆపలేం.

ఉదా.కి ఎవరైనా తెలుగువాడు Zee5 ఒక భారతీయ యాప్‌ కదా అనుకుని… తన భాషలో కూడా ఉంది కదా.. అనుకుని డౌన్‌లోడ్ చేసుకున్నాడనుకోండి. తనకి హిందీ కంటెంట్‌ అక్కర్లేదు… తెలుగు చాలని సెట్టింగ్‌ పెట్టుకోదలిస్తే… అది సాధ్యం కానే కాదు. హిందీ ఆఫ్‌ చేయాలని ప్రయత్నిస్తే – “డిఫాల్ట్‌గా ఉన్న లాంగ్వేజీ కంటెంట్ మీరు ఎడిట్ చెయ్యడం కుదరదు” అని స్పష్టంగా కనిపిస్తుంది. అదే ఒక హిందీవాడు ఈ యాప్‌ లో ఇతర భారతీయ భాషలన్నిటినీ ఆఫ్ చేసి పారేయచ్చు.

ఇతర భారతీయ భాషలన్నిటికీ సమాన గౌరవం ఇస్తున్నట్టుగా నటించే ఈ యాప్… నిజానికి హిందీని మాత్రమే ప్రమోట్ చేసుకుంటూ ఉంటుంది. ఇది మాత్రమే కాదు, ఇలాంటి యాప్స్ ప్లే స్టోర్లో ఎన్నెన్నో ఉన్నాయి. ఇవన్నీ చూపిస్తున్న భాషా వివక్షను మనం ప్రశ్నించాల్సి ఉంది.

హిందీ యాప్స్‌ తయారుచేసుకోవడం తప్పేమీ కాదు. భారతదేశంలోని ప్రతి భాషా గౌరవనీయమైనదే. కానీ ఇండియన్‌ యాప్స్‌ అన్న పేరుతో కేవలం హిందీనే ప్రమోట్‌ చేయడం, పేరుకి మాత్రం ఇతర భాషల్ని కలిపినట్టు చూపడం ఘోరం. ఇది దేశంలోని ఇతర భాషల్ని అవమానించడమే కాదు, ప్రజల్ని మోసం చేయడం కూడా!

This post is also available in: enఇంగ్లిష్‌


PremaLekhalu