పెళ్లయిన మగాళ్ల కష్టాల్ని తెలియజెప్పేలా ‘… భార్యా బంధు’

PremaLekhalu

ఇండియన్ పీనల్ కోడ్ లోని ఒక ముఖ్యమైన సెక్షన్ ను ఆధారం చేసుకుని రూపొందుతున్న వినూత్న కుటుంబ కథాచిత్రం ‘ఐపిసి సెక్షన్.. భార్యాబంధు’. ‘సేవ్ మెన్ ఫ్రమ్ ఉమెన్’ (మహిళల నుంచి మగాళ్లను రక్షించండి) అన్నది కాప్షన్. శరత్ చంద్ర హీరోగా పరిచయమవుతున్న ఈ సినిమాలో… నేహా దేశ్ పాండే హీరోయిన్. రెట్టడి శ్రీనివాస్ దర్శకత్వంలో ఆలూరి సాంబశివరావు నిర్మించారు. నిన్నటి మేటి కథనాయకి ఆమని, ‘గుండె జారి గల్లంతయ్యిందే’ ఫేమ్ మధునందన్ ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ నెల 29న (శుక్రవారం) ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సందర్భంగా మంగళవారం హీరో హీరోయిన్లు విలేకరులతో ముచ్చటించారు.


PremaLekhalu