పూరి డైరెక్షన్ లో నాని చిత్రం..?

PremaLekhalu

హీరో నాని ప్రస్తుతం బిగ్ బాస్ 2 కి హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. ఆయన తన తదుపరి చిత్రం ‘జెర్సీ’ గౌతమ్ డైరెక్షన్ లో చేయనున్నట్లు తెలిసిందే. ఈ సినిమాలో నాని క్రికెటర్ పాత్ర పోషించనున్నాడు. ఇది ఇలా ఉండగా పూరి జగన్నాధ్ డైరెక్షన్ లో నాని ఒక సినిమా చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

వరుస ప్లాప్స్ తో డీలా పడ్డ పూరి జగన్నాధ్ హీరో నానికి ఒక కథ చెప్పి ఒప్పించినట్లు తెలుస్తోంది. అంతా కుదిరితే గౌతమ్ సినిమా పూర్తి కాగానే ఈ సినిమాని సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నారట. ఇలా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంటే దీనిలో ఎటువంటి నిజం లేదు అని నాని స్వయంగా చెప్పారు.


PremaLekhalu