పంతం : మూవీ రివ్యూ

F2 Movie

m#Pantham
చిత్రం : పంతం
విడుదల తేది : జూలై 5 , 2018
తెలుగువాడు. కామ్ రేటింగ్ : 7.5/10
రైటర్ & డైరెక్టర్ : కె.చక్రవర్తి
నిర్మాత : కె.కె.రాధామోహన్
మ్యూజిక్ : గోపి సుందర్
నటీనటులు : గోపిచంద్, మెహ్రీన్ కౌర్, సంపత్ , తనికెళ్ళ భరణి, తదితరులు

పరిచయం :
#Pantham
హీరో గోపిచంద్ 25వ చిత్రంగా తెరకెక్కింది ‘పంతం’. మెహ్రీన్ కౌర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి నూతన దర్శకుడు చక్రవర్తి దర్శకత్వం వహించగా రాధామోహన్ తన సొంత బ్యానర్ మీద నిర్మించారు. ఈ మధ్య వరస ప్లాప్స్ తో సతమతమవుతున్న గోపిచంద్ కి ఈ సినిమా హిట్ ఇస్తుందో లేదో చూద్దాం..!

కథ :-
రాష్ట్ర రాజకీయ నాయకులు అందరూ వారు కాజేసిన డబ్బుని నాయక్ (సంపత్) అలియాస్ హోమ్ మినిస్టర్ దగ్గర దాచుకుంటారు. ఆ మొత్తం డబ్బుని విక్రాంత్ (గోపిచంద్)తెలివిగా కొట్టేసి పేద ప్రజలకు అందజేస్తాడు.
ఈ విషయం తెలుసుకున్న నాయక్ ఎలాగైనా విక్రాంత్ ని పట్టుకోవాలి అని తన గ్యాంగ్ తో గాలిస్తాడు. అసలు ఎవరు ఈ విక్రాంత్? ఎందుకు ఈ దొంగతనాలు చేస్తున్నాడు అనేది మిగిలిన స్టోరీ..!

ప్లస్ పాయింట్స్ :
ఈ సినిమా కథే అతి పెద్ద ప్లస్ పాయింట్. రాజకీయ నాయకుల దగ్గర డబ్బు కొట్టేయడం అనేది కొత్తగా ఉంది. హీరో గోపిచంద్ మరోసారి సినిమాని ముందు ఉంది నడిపించాడు. ఆయన నటన, ఫైట్స్ చాలా బాగున్నాయి. సంపత్ కి ఆయనకి మధ్య వచ్చే సన్నివేశాలు అన్ని బాగుంటాయి. హీరోయిన్ మెహ్రీన్ వెయిట్ తగ్గి ఆకట్టుకుందనే చెప్పాలి. ప్రథమార్థంలో వచ్చే కొన్ని కామెడీ సీన్స్, రెండు దొంగతనాల సన్నివేశాలు బాగున్నాయి. ముఖ్యంగా ద్వితీయార్థంలో వచ్చే కోర్ట్ సీన్ చాలా బాగుంది. అక్కడ గోపిచంద్ చెప్పే డైలాగులు అందరిని ఆలోచింపచేసేలా ఉంటాయి. మిగిలిన నటులు అందరూ కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు.

మైనస్ పాయింట్స్ :-
సినిమాకి ముఖ్యంగా చెప్పుకోవాల్సిన మైనస్ పాయింట్ మ్యూజిక్. గోపి సుందర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగానే ఇచ్చినా ఒక పాట మినహాయించి మిగిలిన పాటలు అంతగా ఆకట్టుకోలేదు. కథ రొటీన్ కావడంతో సెకండ్ హాఫ్ లో ఏమి జరుగుతుందో అనేది తెలిసిపోతుంది. ఇంక హీరో హీరోయిన్ల మధ్య పెద్దగా లవ్ ట్రాక్ లేకపోవడం కూడా మైనస్ అనే చెప్పాలి.

టెక్నికల్ సంగతులు :
నిర్మాణ విలువలు బాగున్నాయి. ఎక్కడా కూడా డబ్బుకు వెనకాడకుండా ఖర్చు పెట్టినట్లు విజువల్స్ చూస్తేనే తెలుస్తుంది. కెమెరా వర్క్, ఎడిటింగ్ రెండు బాగున్నాయి.సంగీతం మాత్రం బాగా నిరాశ పరిచిందనే చెప్పాలి.
డైరెక్టర్ చక్రవర్తి విషయానికి వస్తే కొత్త దర్శకుడైనా తన చెప్పాల్సిన విషయాన్ని చక్కగా స్క్రీన్ మీద చూపించారు. సోషల్ మెసేజ్ కి కమర్షియల్ హంగులు అద్ది మంచి సినిమా తీశారు. ఈ సినిమా మల్టీప్లెక్స్ కన్నా బి, సి సెంటర్స్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుంది.

వెర్డిక్ట్ :- పంతం – పంతం పట్టి హిట్ కొట్టాడు..!

రేటింగ్ : 7 /10


PremaLekhalu