నీతికి మార్కెట్‌ ఉందని నిరూపిస్తున్న యాడ్‌!

SriRamaNavami
Nagarjuna's grandfather is in this ad video.

అన్నిచోట్లా అవినీతి పెరిగిపోయిన ఈ రోజుల్లో – నీతి కూడా ఓ అమ్మదగిన వస్తువు ( సెల్లింగ్‌ కమోడిటీ ) గా మారిపోతోంది. ఇదిగో … అన్నిచోట్లా మోసాలు జరుగుతున్నాయ్‌. “బయట ఎవరు ఎలా ఉండనీ, మేం మాత్రం చాలా నిజాయతీగా ఉంటాం” అంటూ ఏ కంపెనీ అయినా చెబితే – ఆ బ్రాండ్‌కి వాల్యూ పెరిగే పరిస్థితి ఉంది. ఇందుకు తాజా రుజువు… నాగార్జున నటించిన కల్యాణ్‌ జ్యూయెలర్స్‌ యాడ్‌ ఫిల్మ్‌.

ఈ యాడ్‌ వీడియోలో నాగార్జున తాత వేషంలో ఉంటాడు. మనవరాలితో ఆఫీసుకి వస్తాడు. తనకి ఎక్స్‌ట్రా వచ్చిన డబ్బుని తిరిగిచ్చేస్తాడు. అదేంటండీ, మీరే ఈ డబ్బు ఉంచుకోండి… ఆ విషయం ఎవరికి తెలుస్తుంది? – అని అవతలి వ్యక్తి అంటాడు – “నాకు తెలుస్తుంది” అని పవర్‌ఫుల్‌ గా ఆన్సరిస్తాడు నాగార్జున. నిజమే! నీతి అనేది ఇతరులకోసం పాటించాల్సింది కాదు. మనకి మనం నిజాయతీగా ఉండడం ముఖ్యం. ఎవడో చూస్తాడనో ఎవడికో తెలుస్తుందనో భయపడి పాటించే నీతి నీతి కానే కాదు. ఇది ఈ యాడ్‌లో చూపిన మంచి విషయం!

వివేకానంద స్వామి ఒకసారి మాట్లాడుతూ – “పోలీస్‌ ఉన్నాడు కాబట్టి మాత్రమే ఈ సమాజంలో కొందరు దొంగలుగా మారకుండా ఉన్నారు. వాళ్లందరూ నీతిమంతులు కారు. తనను ఎవరూ పట్టుకోరు అని తెలిసినప్పుడు కూడా దొంగతనం చేయనివాడు, తనకోసం తాను నీతిగా ఉండేవాడే నిజమైన నీతిమంతుడు! ” అన్నారు. కానీ దురదృష్టవశాత్తూ నేటి సమాజంలో అలాంటి నిజమైన నిజాయతీపరుల సంఖ్య తగ్గినట్టనిపిస్తోంది. ట్రాఫిక్‌ పోలీస్‌ చూడకపోతే సిగ్నల్‌ దాటేసే జనం, దొరకంలే అనే నమ్మకం కలిగితే దొంగతనానికి సిద్ధమైపోయే జనం ఇప్పుడు పెరిగిపోయారు. అందువల్లే – 100% నీతి అనేది అరుదైన విషయంగా మారిపోయి… చివరికి అది కూడా ఓ అమ్మదగిన వస్తువైపోయింది. “మేం నిజాయతీగా ఉంటాం, మా ప్రోడక్ట్‌లో మోసాలు ఉండవు” అని చెప్పుకోవడం – ఒక ప్రోడక్ట్‌ కి లాభం కలిగించే అంశంగా మారింది. మన నిజాయతీ పట్ల కస్టమర్లకి నమ్మకాన్ని కలిగించి, ఆ నమ్మకాన్ని అమ్ముకోవడం కొన్ని ప్రోడక్ట్స్‌ స్టయిల్‌. అరుదైన వస్తువుకి డిమాండ్‌ ఎక్కువ కదా? అందుకే నీతి అనేది ఇప్పుడు యాడ్‌ వస్తువయింది. నమ్మకాన్ని అమ్మకాలకోసం వాడుకోవడం తప్పా రైటా అని ఆలోచించడం మానేసి – దాన్ని ఓ మార్కెటింగ్‌ టెక్నిక్‌గానే మనం చూద్దాం. ఏమంటారు?

This post is also available in: enఇంగ్లిష్‌


PremaLekhalu