నాన్నతో చెయ్యలేనిది కొడుకుతో సాధ్యమైంది : కార్తీక్

PremaLekhalu

ఒకనాడు తెలుగు తెరను అలరించిన ‘సీతాకోకచిలుక’ సినిమా తెలుసుగా?… అందులో హీరోగా నటించిన కార్తీక్‌ని ఎవరూ మర్చిపోయి ఉండరు. మణిరత్నం ఘర్షణ కూడా కార్తీక్ సూపర్ హిట్స్ లో ఒకటి! తమిళ సినీ ప్రముఖుడు ముత్తురామన్ కొడుకైన కార్తీక్ ఇప్పుడు తన కొడుకు గౌతం కార్తీక్‌తో కలసి ‘మిస్టర్ చంద్రమౌళి’లో తెరపై కనిపించాడు. గత వారంలోనే విడుదలైన ఈ సినిమాలో తన కొడుకుతో కలసి నటించిన అనుభవం గురించి కార్తీక్ మాట్లాడుతూ… తాను సినిమాల్లోకి వచ్చినప్పుడు తన తండ్రి ముత్తురామన్‌తో కలసి నటించాలని ఉండేదని, అయితే ఆ కోరిక తీరలేదన్నారు. కానీ, ఇప్పుడు తన కొడుకుతో కలసి నటించడం వల్ల కాస్త సంతృప్తిగా ఉందన్నారు. ఈ సందర్భంగా కార్తీక్ తన రాజకీయ భవిష్యత్తు పైనా స్పందించారు. తన పార్టీ ‘నాడాళుం మక్కళ్ కట్చి’ 2019 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చెయ్యడం గురించి ఇంకా నిర్ణయమేదీ తీసుకోలేదన్నారు. ప్రస్తుతం తాను రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ, అన్ని పరిణామాలను గమనిస్తూనే ఉన్నానంటూ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటానన్నారు. మన టాలీవుడ్ టాప్ కమెడియన్ అయిన అలీ… కార్తీక్ ‘సీతాకోకచిలుక’లో బాల నటునిగా పండించిన హాస్యం ఆయన్ని చిరస్థాయిగా నిలబెట్టింది.

This post is also available in: enఇంగ్లిష్‌


PremaLekhalu