దసరాకి పందెంకోడి సీక్వెల్

PremaLekhalu

విశాల్ హీరోగా డైరెక్టర్ లింగుస్వామి తెరకెక్కిస్తున్న చిత్రం ‘సందకోజ్హి-2’. ఈ సినిమా 2006లో వచ్చిన సందకోజ్హి కి సీక్వెల్. ఈ సినిమా అప్పట్లో పెద్ద విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సీక్వెల్ మీద కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 18 న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించాడు విశాల్. కీర్తి సురేష్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుండగా వరలక్ష్మి శరత్ కుమార్ విలన్ పాత్ర చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమా తెలుగులో పందెంకోడి2 పేరుతో డబ్ చేస్తారట.

హీరో విశాల్ తన సొంత బ్యానర్ మీద నిర్మిస్తున్న ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నాడు.

This post is also available in: enఇంగ్లిష్‌


PremaLekhalu