తమిళ బిగ్‌ బాస్ విన్న‌ర్ ఆర‌వ్ హీరోగా ‘రాజ భీమా’

సినిమాల్నించి టీవీకి వెళ్లేవాళ్లే గానీ – టీవీల్నించి సినిమాలకి వచ్చేవాళ్లని హీరోలుగా ఆదరించడం మనకి లేదు. ఎక్కడో బాలీవుడ్‌లో షారుఖ్‌ ఖాన్‌ లాంటివాడు టీవీనుంచి వచ్చి సినిమా హీరో అయ్యాడుగానీ – మనకి మాత్రం సినిమా కెరీర్‌ దెబ్బ తిని టీవీకి వెళ్లేవాళ్లే ఎక్కువ. అయితే- త‌మిళంలో క‌మ‌ల్ హాస‌న్ వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రించిన‌ బిగ్ బాస్ సీజ‌న్ 1 లో విజేత అయినా ఆర‌వ్ ఇప్పుడు వెండితెర‌ మీదికొస్తున్నాడు. ఆర‌వ్ హీరో న‌టిస్తున్న చిత్రం పేరు ‘రాజ భీమా’.
సుర‌భి ఫిలింస్ బ్యాన‌ర్‌పై న‌రేశ్ సంప‌త్ ద‌ర్శ‌క‌త్వంలో ఎస్‌.మోహ‌న్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం సినిమా చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది. ఈ సినిమా ఫ‌స్ట్‌లుక్‌ను విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా చిత్ర నిర్మాత ఎస్‌.మోహ‌న్ మాట్లాడుతూ -”ఆర‌వ్‌ను హీరోగా ప‌రిచ‌యం చేస్తూ  మేకింగ్‌లో ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా భారీ బ‌డ్జెట్‌తో.. వైవిధ్య‌మైన క‌థాంశంతో.. బ్యూటీఫుల్ లొకేష‌న్స్‌లో చిత్రాన్ని నిర్మిస్తున్నాం. ద‌ర్శ‌కుడు న‌రేశ్ సంప‌త్ అద్భుత‌మైన క‌థ‌, క‌థ‌నంతో ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాం. త్వ‌ర‌లోనే సినిమాకు సంబంధించిన మ‌రిన్ని విష‌యాల‌ను తెలియ‌జేస్తాం” అని రొటీన్‌ మాటలు చెప్పారు.  చూద్దాం. హిట్టయితే మంచిదేగా?
ఈ చిత్రానికి సినిమాటోగ్ర‌ఫీ: ఎస్‌.ఆర్‌.స‌తీశ్ కుమార్‌, మ్యూజిక్‌:  సైమాన్ కె.కింగ్‌, ఎడిటింగ్‌:  గోపీ కృష్ణ‌, స్క్రీన్ ప్లే, డైలాగ్స్‌:  క‌రుణ్‌దేల్ రాజేశ్‌, ఆర్ట్‌:  ఎ.ఆర్‌.మోహ‌న్‌, స్టంట్స్‌: హ‌రి దినేశ్‌, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌:  కె.బి.బ‌షీర్ అహ్మద్‌, ప్రొడ్యూస‌ర్‌: ఎస్‌.మోహ‌న్‌, ద‌ర్శ‌క‌త్వం: న‌రేశ్ సంప‌త్‌.

This post is also available in: enఇంగ్లిష్‌