తమిళ అర్జున్ రెడ్డి కి హీరోయిన్ దొరికింది..!

F2 Movie

విజయ్ దేవరకొండ, షాలిని పాండే జంటగా తెలుగులో రూపొందిన చిత్రం ‘అర్జున్ రెడ్డి’. ఈ సినిమా రిలీజ్ అయి మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఈ సినిమా తమిళంలో రీమేక్ అవుతోంది. దర్శకుడు బాలా ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తుండగా హీరో విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్ ఈ సినిమా ద్వారా హీరోగా పరిచయం కాబోతున్నాడు.

ఇక ఈ సినిమా లో హీరోయిన్ కోసం పలువురు హీరోయిన్స్ పేర్లు పరిశీలించిన చిత్ర యూనిట్ చివరికి బెంగాలీ మోడల్ మేఘా ని హీరోయిన్ గా ఎంపిక చేసింది. ఈ సినిమా గురించి మరిన్ని విషయాలు త్వరలోనే వెల్లడించనుంది చిత్ర యూనిట్.


PremaLekhalu