
కోలార్ బంగారు గనుల బ్యాక్ డ్రాప్లో కన్నడ హీరో యశ్ హీరోగా ‘కేజీఎఫ్’ అనే సినిమా వస్తోంది. దీన్ని తెలుగు,తమిళ,కన్నడ భాషలు మూడింటిలోనూ విడుదల చేస్తున్నారు. తెలుగు వెర్షన్ కి కైకాల సత్యనారాయణ సమర్పణ అంటూ తెలుగు వాళ్లకి కాస్త దగ్గరయ్యే ప్రయత్నం చేశారు. ఇందులో తమన్నా ఓ పాటలో కనిపిస్తుందంతే. హీరోయిన్ కాదు. హీరోయిన్ శ్రీనిధి శెట్టి అనీ… కన్నడ హీరోయిన్. సరే. కన్నడలో స్టార్ హీరో సుదీప్. ఈగ, బాహుబలి తరవాత గానీ అలాంటి సుదీప్ నే మనవాళ్లు గుర్తుపట్టలేదు. మరి అక్కడ రాకింగ్ స్టార్ అని పేరుపెట్టుకున్న కుర్రహీరో అయిన యశ్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు? యశ్ కన్నడలో చాలా సినిమాలే చేశాడు. మాస్టర్ పీస్’, ‘గజకేసరి’ లాంటి హిట్స్ ఉన్నాయి. కానీ కన్నడ సినిమాలంటే – క్వాలిటీ తక్కువని – ముందే మనకొక లెక్క! చూద్దాం. నిర్మాతల లక్ ఎలా ఉందో!
‘రాకింగ్ స్టార్’ యాష్ , శ్రీనిధి శెట్టి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో అనంత్‌నాగ్, అచ్యుత్‌రావు, అయ్యప్ప .పి.శర్మ తదితరులు నటిస్తున్నారు. కెమెరా : భువన్ గౌడ, ఎడిటింగ్: శ్రీకాంత్, సంగీతం:రవి భసూర్, పాటలు:రామజోగయ్య శాస్ట్రి, మాటలు:హనుమాన్ చౌదరి, ఆర్ట్:శివకుమార్, పి.ఆర్.ఓ: సురేష్ కొండేటి, కొరియోగ్రఫీ:జానీ, ఫైట్ మాస్టర్:అన్ బరివు-విక్రమ్, సహ నిర్మాత:కైకాల రామారావు, నిర్మాత:విజయ్ కిరంగధూర్, సమర్పణ:కైకాల సత్యనారాయణ, కథ,స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:ప్రశాంత్ నీల్.
This post is also available in:
ఇంగ్లిష్